మెగా కపుల్(Mega couple) వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జంట మాల్దీవుల వెకేషన్(Maldives vacation) నుంచి తిరిగి వస్తుండగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో లావణ్య బేబీ బంప్(Lavanya’s baby bump)తో కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియా(SM)లో వైరల్‌గా మారింది. కాగా 2023 నవంబర్‌లో ఇటలీలోని టస్కానీలో వీరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే 6న తాము త్వరలో తల్లిదండ్రులు రాబోతున్నట్లు ఈ కపుల్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఆ తర్వాత తాజాగా ఈ జంట హైదరాబాద్ విమానాశ్రయంలో కలిసి కనిపించారు. అయితే లావణ్య తన బేబీ బంప్‌ను దాచుకునేందుకు ఓవర్‌సైజ్‌డ్ పింక్ స్వెట్‌షర్ట్ ధరించారు.

సినీ ప్రాజెక్టులు తగ్గించుకున్న లావణ్య
కాగా మాల్దీవులలో విహారయాత్రలో ఉన్న ఫొటోలు(Photos) నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. లావణ్య తన బేబీ బంప్‌తో సముద్ర తీరంలో సంతోషంగా కనిపించారు. ఈ జంట బీచ్‌లో హాయిగా గడిపిన క్షణాలు, యాచ్‌లో విశ్రాంతి తీసుకుంటూ కనిపించిన దృశ్యాలు అభిమానులను ఆనందపరిచాయి. కాగా లావణ్య తన పెళ్లి తర్వాత సినిమా ప్రాజెక్టులను తగ్గించుకున్నారు. ఆమె తాజాగా ‘సతీ లీలావతి’, ‘తనల్’ అనే తమిళ చిత్రంలో నటించారు. వరుణ్ తేజ్ తన తాజా చిత్రం ‘మట్కా(Matka)’ తర్వాత, ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రంలో నటిస్తున్నారు.
View this post on Instagram






