గోవా గవర్నర్(Governor of Goa)గా సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు(Pusapati Ashok Gajapathi Raju) ఈరోజు (జులై 26) బాధ్యతలు చేపట్టనున్నారు. గవర్నర్ బంగ్లా దర్బార్ హాలులో ఉదయం 11 గంటలకు అశోక్ గజపతిరాజుతో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(Chief Justice of Bombay High Court) ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం ఆయన గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ప్రమాణస్వీకార(Oath taking) కార్యక్రమంలో ఏపీకి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు(Union Minister Rammohan Naidu), మంత్రులు నారా లోకేశ్(Nara Lokesh), కొండపల్లి శ్రీనివాస్, గోవా ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఉన్నతాధికారులు, రాజకీయ పార్టీల ప్రముఖులు తదితరులు హాజరుకానున్నారు.
Minister For Protocol, Shri @MauvinGodinho received Designate Governor, Shri Pusapati Ashok Gajapathi Raju on his arrival at MIA, Mopa.
MLA, Shri @PravinArlekar, Chief Secretary, Dr. V. Candavelou, IAS, DGP Goa, Shri Alok Kumar, IPS,…(1/2) pic.twitter.com/GQeOnAWhew
— DIP Goa (@dip_goa) July 25, 2025
కాగా, ప్రమాణ స్వీకార నేపథ్యంలో అశోక్ గజపతిరాజుతో పాటు ఆయన భార్య సునీలా గజపతిరాజు(Sunila Gajapathiraju), కుమార్తె, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, మరో కుమార్తె విద్యావతిదేవి నిన్న రాత్రే గోవాకు చేరుకున్నారు. అశోక్ కుటుంబంతో పాటు ఆయన సన్నిహితులు, బంధువులు, పలువురు TDP నేతలు ఇప్పటికే అక్కడకు వెళ్లారు. గోవా విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అశోక్ గజపతిరాజుకు స్వాగతం పలికారు.






