
టికెట్ ధరల పెంపు(Ticket price increase) అనేది కొన్ని సినిమాలకు వరంలా మారితే, మరికొన్ని సినిమాలకు శాపం అవుతుంది. తాజాగా విడుదలైన ‘హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu)’ విషయంలోనూ అదే జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్‌ని రాబట్టిన వీరమల్లు.. రెండో రోజు నుంచి ఆ స్థాయి వసూళ్ల(Collections)ను రాబట్టలేకపోయింది. దానికి ప్రధాన కారణం.. అధిక టికెట్ ధరల కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ వెనకడుగు వేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన మేకర్స్ టికెట్ ధరల విషయంలో మనసు మార్చుకున్నారు.
‘హరి హర వీరమల్లు’ సినిమాకి మొదటి పది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. అయితే ఏపీతో పోలిస్తే ఇప్పటికే తెలంగాణ(Telangana)లో టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని ఇంకా పెంచడంతో.. అధిక ధరల కారణంగా ఫుట్ ఫాల్స్ పై ప్రభావం పడింది. దీంతో మేకర్స్ టికెట్ రేట్స్ తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం (జులై 28) నుంచి టికెట్ ధరలు సాధారణంగా ఉండనున్నాయి. ఇప్పటికే ఆన్ లైన్లో రెగ్యులర్ టికెట్ రేట్స్‌తో బుకింగ్స్ చూపిస్తున్నాయి.
సింగిల్ స్క్రీన్‌కు రూ.175, మల్టీప్లెక్స్‌లలో రూ.295కే
కాగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటించిన ‘హరి హర వీరమల్లు’ ఈనెల 24న థియేటర్లలో అడుగుపెట్టింది. ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ్టి నుంచి టికెట్ ధరలు సాధారణంగా ఉండటంతో.. ఫుట్ ఫాల్స్ పెరిగే అవకాశముందని సినీవర్గాలు పేర్కొటున్నాయి. ఇప్పటికే ఈ మేరకు బుక్ మై షో, ఇతర బుకింగ్ వెబ్ సైట్లలో ధరలు తగ్గించి చూపిస్తున్నాయి. టికెట్ ధరలు సాధారణ స్థాయికి చేరడంతో సింగిల్ స్క్రీన్ టికెట్ రూ.175, మల్టీప్లెక్స్‌లలో రూ.295కు టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
The new version of #HariHaraVeeraMallu with a trimmed CLIMAX will be screened from today’s matinee shows, and REGULAR TICKET prices will be applicable in single screens across Andhra Pradesh and Telangana starting TOMORROW. pic.twitter.com/nlqri8xp0b
— Telugu Chitraalu (@CineChitraalu) July 27, 2025