బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె(Deepika Padukone) మరో ఘనత దక్కించుకున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ బ్యూలీ మరో అరుదైన గౌరవాన్ని పొందారు. ప్రముఖ మ్యాగజైన్ ‘ది షిఫ్ట్(The Shift Magazine)’ ప్రకటించిన ప్రభావవంతమైన మహిళల జాబితాలో ఆమె పేరు నిలిచింది. క్రియాశీలత, సృజనాత్మకత, నాయకత్వం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించారు. ఇందులో బాలీవుడ్ డైరెక్టర్ జోయా అక్తర్, హాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఏంజెలినా జోలీ, సెలినా గోమెజ్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు.
తొలి భారతీయ నటిగా గుర్తింపు
ఇప్పటికే ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ (Hollywood Walk of Fame Star 2026)’ గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ నటి దీపిక. ఈ గౌరవం ఆమె సినీ రంగంలో చేసిన కృషికి, ప్రపంచవ్యాప్తంగా ఆమె సాధించిన గుర్తింపునకు నిదర్శనం. హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(Hollywood Chamber of Commerce) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ నటిగా దీపిక నిలిచారు. ఇది భారత సినిమా పరిశ్రమకు గర్వకారణం. కాగా దీపిక 2006లో కన్నడ చిత్రం ‘ఐశ్వర్య’తో సినీ రంగంలో అడుగుపెట్టారు.
Deepika Padukone Joins the list of 90 Extraordinary Women “Shifting Culture, Leadership & Future” Global Honourees: A Tribute Issue To Gloria Steinem #DeepikaPadukone https://t.co/UWi04wqMu8 pic.twitter.com/xpaSEHeoTP
— Urban Asian (@UrbanAsian) July 27, 2025
ఆ తర్వాత ‘ఓం శాంతి ఓం(Om Shanti Om)’తో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసి, వరుస విజయాలతో టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. ‘పఠాన్’, ‘పద్మావత్’, ‘బాజీరావు మస్తానీ’ వంటి చిత్రాలతో ఆమె నటనా ప్రతిభను చాటారు. 2018లో టైమ్ మ్యాగజైన్ ఆమెను ప్రపంచంలోని ‘100 మంది ప్రభావవంతమైన వ్యక్తుల జాబితా’లో చేర్చింది. 2022లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ(Cannes Film Festival Jury) సభ్యురాలిగా, 2023లో ఆస్కార్ అవార్డుల ప్రజెంటర్‌గా ఆమె హాజరైన సంగతి తెలిసిందే.

అల్లు-అట్లీ ప్రాజెక్టులో కీలక పాత్ర
ఈ గౌరవంపై దీపికా స్పందిస్తూ, “ఇది భారత సినిమాకు దక్కిన గౌరవం. నా ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు” అని అన్నారు. ఆమె తండ్రి, ప్రముఖ మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొణె(Prakash Padukone) 70వ జన్మదిన సందర్భంగా దీపికా చేపట్టిన సామాజిక కార్యక్రమాలతోనూ ఆమె సేవాస్ఫూర్తి చాటారు. తాజా గౌరవంతో దీపికా మరింత ఉత్సాహంతో ముందుకు సాగనుంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న ‘AA26’ సినిమాలో కథానాయికగా దీపిక ఎంపికైన విషయం తెలిసిందే.







