Box Office Collections: భారీ వసూళ్లతో మహావతార్ నర్సింహా.. బాక్సాఫీస్ కలెక్షన్లు చూస్తే ఆశ్చర్యపోతారు!

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్(Hombale Films) సమర్పణలో రూపొందిన యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహా బాక్సాఫీస్ వద్ద మంచి హవా కొనసాగిస్తోంది(Mahavatar Narasimha Box Office Collections). శిల్పా ధావన్, కుషాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మాతలుగా ఈ సినిమాను అశ్వినీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించారు.

పూర్తి స్థాయి యానిమేటెడ్ సినిమాగా రూపొందిన ఈ చిత్రానికి సామ్ C.S. శక్తివంతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. క్లీమ్ ప్రొడక్షన్స్ ఎడిటింగ్, జయపూర్ణ దాస్ రచన సహకారం అందించారు. జులై 25న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సత్తా చాటుతోంది. అన్ని వర్గాల ఆడియన్స్ ఈ సినిమా కోసం థియేటర్ల వైపు పరుగులు పెడుతున్నారు.

కేజీఎఫ్, కాంతారా వంటి విజయం సాధించిన సినిమాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్, ఈసారి కూడా అత్యాధునిక టెక్నాలజీ, అద్భుతమైన వీఎఫ్ఎక్స్(VFX) సహాయంతో మహావతార్(Mahavatar Narasimha) సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందించింది. సుమారు రూ.20 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం నిర్మించబడినట్టు సమాచారం. సినిమాకు ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ పెద్దగా లేనప్పటికీ, విడుదలైన తర్వాత మౌత్ టాక్ సూపర్ హిట్‌గా మారింది.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1000 స్క్రీన్లలో ఈ చిత్రం విడుదల కాగా, మొదటి రోజు 1.75 కోట్లు, రెండో రోజు 4.6 కోట్లు, మూడో రోజు 9.5 కోట్లు వసూలు చేయడం విశేషం. నాలుగో రోజు సోమవారం కూడా నిలకడగా 3 కోట్ల రూపాయల వసూళ్ల(Collections)ను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు ఈ చిత్రం మొత్తం 17 కోట్ల రూపాయల వసూళ్లు సాధించగా, తెలుగు లో 4 కోట్లు, హిందీ లో 11.5 కోట్లు, కన్నడ లో 50 లక్షలు, తమిళంలో 40 లక్షలు, మలయాళంలో 20 లక్షలు వసూలు అయ్యాయి.

ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 20 కోట్ల షేర్ మరియు 40 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది. ఇప్పటికే 50% మార్కును దాటేసిన నేపథ్యంలో, వారాంతంలో ఈ చిత్రం లాభాల్లోకి వెళ్లే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అయితే ఆగస్టు 1న ఓవర్సీస్ విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా, అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి వసూళ్లు సాధించవచ్చని అంచనా వేస్తున్నారు. మహావతార్ నరసింహా అనేది యానిమేషన్ ప్రాధాన్యతతో వచ్చిన రాకింగ్ విజయం అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *