HHVM: ‘మనల్ని ఎవడ్రా ఆపేది’.. హరి హర వీరమల్లు టీమ్ పోస్ట్ చూశారా?

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటించిన ‘హరి హర వీరమల్లు(HHVM)’ ఈనెల 24న థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్(Boxoffice) వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో పవన్ మూవీ కలెక్షన్లపై రకరకాల వార్తలు వినిపిస్తున్న వేళ సోషల్ మీడియా వేదికగా హరిహర వీరమల్లు చిత్రబృందం(Harihara Veeramallu Film) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు తమ సోషల్ మీడియా అధికారిక ఖాతా ద్వారా పోస్టు పెట్టింది. మనల్ని ఎవడ్రా ఆపేది.. అన్ని థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌‌గా సినిమా ప్రదర్శితమవుతోంది. కొన్ని ఛేంజెస్ తర్వాత ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది అని చిత్రబృందం ప్రకటించింది.

10 నుంచి 15 నిమిషాల ఫుటేజీ కట్

కాగా, సినిమా అభిమానులతో పాటు స్వయంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్ నుంచి కూడా VFX పై విమర్శలు వచ్చాయి. దీంతో చేసేదేం లేక మేకర్స్ కొన్ని మార్పులు చేశారు. దీంతో యాక్షన్‌ సీన్‌లో చిన్నచిన్న మార్పులతోపాటు క్లైమాక్స్‌ నిడివి కూడా బాగా తగ్గింది. ఇలా మొత్తంగా 10 నుంచి 15 నిమిషాల ఫుటేజీని సినిమా నుంచి తొలగించారు. ప్రస్తుతం థియేటర్లలో ఈ సవరించిన వెర్షనే ప్రదర్శితమవుతోంది. జులై 24న థియేటర్లలో విడుదలైన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌(Nidhi Agarwal)గా నటించింది. ఫ్యాన్స్ వ‌ల‌న ఫస్ట్ మూడు రోజులు బాగానే కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం.

Hari Hara Veera Mallu (HHVM) Box Office Collection Day 4 Early Updates  (Today): Pawan Kalyan Film Roars; Crosses Rs 70 Cr In First Weekend | Hari  Hara Veera Mallu (Telugu) Today Collection

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో నటించగా, నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్(Bobby Deol) కీలక పాత్రలో కనిపించారు. క్రిష్ జాగర్లమూడి, AM జ్యోతి కృష్ణ దర్శకత్వంలో AM రత్నం నిర్మించిన ఈ చిత్రానికి MM కీరవాణి సంగీతం అందించారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *