పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటించిన ‘హరి హర వీరమల్లు(HHVM)’ ఈనెల 24న థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్(Boxoffice) వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో పవన్ మూవీ కలెక్షన్లపై రకరకాల వార్తలు వినిపిస్తున్న వేళ సోషల్ మీడియా వేదికగా హరిహర వీరమల్లు చిత్రబృందం(Harihara Veeramallu Film) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు తమ సోషల్ మీడియా అధికారిక ఖాతా ద్వారా పోస్టు పెట్టింది. మనల్ని ఎవడ్రా ఆపేది.. అన్ని థియేటర్లలో సక్సెస్ఫుల్గా సినిమా ప్రదర్శితమవుతోంది. కొన్ని ఛేంజెస్ తర్వాత ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది అని చిత్రబృందం ప్రకటించింది.
“Manalni Evadra Aapedi” ⚔️#HariHaraVeeraMallu is running super successfully with audiences raving about its stunning visuals and powerful storytelling 🦅🦅
Watch it now in cinemas near you. #BlockbusterHHVM #HHVM
Powerstar @PawanKalyan @AMRathnamOfl @thedeol #SatyaRaj… pic.twitter.com/HLtvQ0ghof— Hari Hara Veera Mallu (@HHVMFilm) July 29, 2025
10 నుంచి 15 నిమిషాల ఫుటేజీ కట్
కాగా, సినిమా అభిమానులతో పాటు స్వయంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్ నుంచి కూడా VFX పై విమర్శలు వచ్చాయి. దీంతో చేసేదేం లేక మేకర్స్ కొన్ని మార్పులు చేశారు. దీంతో యాక్షన్ సీన్లో చిన్నచిన్న మార్పులతోపాటు క్లైమాక్స్ నిడివి కూడా బాగా తగ్గింది. ఇలా మొత్తంగా 10 నుంచి 15 నిమిషాల ఫుటేజీని సినిమా నుంచి తొలగించారు. ప్రస్తుతం థియేటర్లలో ఈ సవరించిన వెర్షనే ప్రదర్శితమవుతోంది. జులై 24న థియేటర్లలో విడుదలైన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్(Nidhi Agarwal)గా నటించింది. ఫ్యాన్స్ వలన ఫస్ట్ మూడు రోజులు బాగానే కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో నటించగా, నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్గా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్(Bobby Deol) కీలక పాత్రలో కనిపించారు. క్రిష్ జాగర్లమూడి, AM జ్యోతి కృష్ణ దర్శకత్వంలో AM రత్నం నిర్మించిన ఈ చిత్రానికి MM కీరవాణి సంగీతం అందించారు.






