‘కుబేర’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు సీనియర్ నటుడు నాగార్జున (Nagarjuna). మూవీలో డిఫరెంట్ క్యారెక్టర్ చేసి మెప్పించారు. 1998లో ఆయన నటించిన మూవీ ‘చంద్రలేఖ’ (Chandralekha). రమ్యకృష్ణ, ఇషా కొప్పికర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ యావరేజ్ గా ఆడినా పాటలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను ఇషా కొప్పికర్ (Isha Koppikar) తాజాగా గుర్తుచేసుకున్నారు. మూవీలో ఓ సీన్ బాగా రావడానికి నాగార్జునతో కావాలనే తాను చెంపదెబ్బలు కొట్టించుకున్నట్లు ఆమె వెల్లడించారు.
చెంపదెబ్బలతో నా ముఖమంతా కందిపోయింది
ఇషా కొప్పికర్ మాట్లాడుతూ.. ‘‘చంద్రలేఖ’ నాకు రెండో సినిమా. ఇందులో నాగార్జున నన్ను కోపంగా కొట్టే సన్నివేశం ఒకటి ఉంటుంది. సీన్ బాగా రావడం కోసం నేను ఆయనతో నిజంగానే కొట్టమని చెప్పాను. ఆయన మొదట చిన్నగా కొట్టారు. ఆ సన్నివేశం సరిగ్గా రాలేదు. ‘నాకు కోపం రావడం లేదు. మీరు గట్టిగానే కొట్టండి’ అని మరోసారి చెప్పా. ఆ సీన్ బాగా రావడం కోసం రీటేక్ లు తీసుకున్నారు. దీంతో 14, 15 సార్లు నా చెంపపై గట్టిగా కొట్టారు. సీన్ పూర్తయ్యేసరికి ముఖమంతా కందిపోయింది. చెంపమీద వాతలు పడ్డాయి. దీంతో నాగార్జున బాధపడి క్షమాపణలు చెప్పారు. నేను వద్దని వారించాను. సన్నివేశం డిమాండ్ చేస్తే ఇలాంటివి సహజం అన్నాను’ అని నాటి విషయాలను గుర్తుచేసుకున్నారు.
OMG! #IshaKoppikar reveals #Nagarjuna slapped her 15 times due to THIS reason: ‘I had marks on my face’https://t.co/Yk9dZcEOdO
— DNA (@dna) July 30, 2025
చంద్రలేఖ తర్వాత వరుస ఛాన్సులు
చంద్రలేఖ మూవీలో ఇషా కొప్పికర్ అందానికి జనాలు ఫిదా అయ్యారు. దీంతో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో అలరించారు. 50కు పైగా సినిమాలు, పలు వెబ్ సిరీసుల్లోనూ యాక్ట్ చేశారు. 2017లో నిఖిల్ హీరోగా వచ్చిన ‘కేశవ’లో పోలీస్ ఆఫీసర్గా నటించారు.






