ప్రముఖ హీరోయిన్ నటి పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్(Vimal Kumar Rajput) (67) ఢిల్లీలో సోమవారం కన్నుమూశారు. ఈ విషాద సంఘటనను తాజాగా పాయల్ సోషల్ మీడియా(SM) ద్వారా వెల్లడించింది. కాగా విమల్ కుమార్ గత కొంతకాలంగా క్యాన్సర్(Cancer)తో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె తండ్రి గురించి భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టింది.
View this post on Instagram
‘క్యాన్సర్‌ను జయిస్తావని అనుకున్నాను. మీకు మనోధైర్యం ఇవ్వడానికి నేను చేయాల్సినదంతా చేశాను. మిమ్మల్ని కాపాడుకునే పోరాటంలో విజయం సాధించలేకపోయాను. క్షమించండి నాన్న(Sorry Nanna)’ అని ఎమోషనల్ అయ్యారు. పాయల్ ఈ కష్ట సమయంలో కూడా తన సినీ ప్రాజెక్టులను కొనసాగిస్తూ, తండ్రి ఆశీస్సులతో ముందుకు సాగుతానని చెప్పింది. కాగా విమల్ కుమార్ ఒక ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఈ వార్త తెలిసిన అభిమానులు, సినీ పరిశ్రమలోని పలువురు పాయల్‌కు సానుభూతి తెలిపారు. ఆమె తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని కామెంట్స్ చేస్తున్నారు.






