India vs England: సమం చేస్తారా? సమర్పిస్తారా? నేటి నుంచి ఐదో టెస్ట్

ఇండియా, ఇంగ్లండ్(India vs England) మధ్య చివరిదైన ఐదో టెస్టు ఇవాళ్టి నుంచి జరగనుంది. ఈ మ్యాచ్ లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌(Kennington Oval)లో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ప్రారంభమైంది. ఇప్పటికే సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉండగా.. ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలని భారత్ భావిస్తోంది. ఈ సిరీస్ 2025-2027 ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలకం కావడంతో గిల్ సేన ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి. అటు మ్యాచు నెగ్గి సిరీస్‌ను పట్టేయాలని ఇంగ్లండ్ చూస్తోంది. అయితే ఆతిథ్య జట్టుకు కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) గాయం కారణంగా ఈ మ్యాచుకి దూరమవడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. అతడి స్థానంలో ఒలీ పోప్(Ollie Pope) కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. జామీ ఓవర్టన్‌ను జట్టులోకి తీసుకున్నారు.

IND vs ENG Highlights, 3rd Test: India ends Day 4 at 58/4, needs 135 more  to win on final day - Sportstar

టాస్‌కు ముందు భారత తుది జట్టు ప్రకటన

ఇండియా జట్టులో రిషభ్ పంత్(Rishabh Pant) స్థానంలో N జగదీశన్ చోటు దక్కించుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఈ మ్యాచ్ ఆడేది లేనిది టాస్ సమయంలో వెల్లడిస్తామని కెప్టెన్ గిల్ తెలిపాడు. మరోవైపు బౌలింగ్‌లో అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్, మహ్మద్ సిరాజ్‌, ఆకాశ్ దీప్‌లతో కూడిన బౌలింగ్ యూనిట్ ఫిట్‌గా ఉందని కోచ్ గంభీర్ తెలిపాడు. ఇక బ్యాటింగ్‌ విభాగంలో భారత్ బలంగా కనిపిస్తోంది. ఈ సిరీస్‌లో గిల్ (722 రన్స్), రాహుల్ (511 రన్స్) టాప్ స్కోరర్లుగా ఉన్నారు. కాగా ఓవల్ పిచ్ బౌలర్లకు సహకరించే అవకాశం ఉండటంతో టాస్ నెగ్గిన జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో వాతావరణం కీలకం కానుంది. తొలి రెండు రోజులు వర్షం ఆటంకం కలిగించవచ్చని అక్కడి వాతావరణశాఖ తెలిపింది.

Jasprit Bumrah Out of IND vs ENG 2nd Test: India Scramble for Answers Ahead  of Edgbaston Test | Cricket - Times Now

ఇంగ్లండ్ తుది జట్టు ఇదే

ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జామీ ఓవర్టన్, జోష్ టంగ్

భారత జట్టు అంచనా: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), శార్దుల్ ఠాకూర్/బుమ్రా, ఆకాష్ దీప్, ప్రసిద్ కృష్ణ/అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *