IT Notice: మీ కరెంట్ బిల్ ఈ పరిమితిని మించితే జాగ్రత్త.. ఐటీ నోటీసు రావచ్చు!

మీ ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం మీ ఆదాయం మినహాయింపు పరిమితిని మించితే, మీరు తప్పనిసరిగా ఐటీఆర్ (Income Tax Return) ఫైల్ చేయాలి. అయితే, ఈ మినహాయింపు పరిమితి మీరు ఎంచుకున్న పన్ను విధానంపై ఆధారపడి ఉంటుంది. ఇది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139(1) ప్రకారం అమలవుతుంది.

పాత vs కొత్త పన్ను విధానాలు

ఇప్పుడు దేశంలో రెండు పన్ను విధానాలు అందుబాటులో ఉన్నాయి. పాతది, కొత్తది. కొత్త పన్ను విధానాన్ని(NewTax Regime) ఎంచుకున్నవారికి, ఏ వయస్సు ఉన్నవారైనా మినహాయింపు పరిమితి రూ.3 లక్షలు. అంటే, మీ వార్షిక ఆదాయం రూ.3 లక్షలు మించితే తప్పనిసరిగా ఐటీఆర్ ఫైల్ చేయాలి.

పాత పన్ను విధానం (Old Tax Regime)లో మినహాయింపు పరిమితి వయస్సు ఆధారంగా మారుతుంది. సాధారణ పన్ను దాతలకు (వయస్సు 60 సంవత్సరాలలోపు) రూ.2.5 లక్షలు వరకు ఆదాయం ఉంటే పన్ను లేదు. సీనియర్ సిటిజన్లకు (వయస్సు 60-80 సంవత్సరాల మధ్య) మినహాయింపు పరిమితి రూ.3 లక్షలు. సూపర్ సీనియర్ సిటిజన్లకు (వయస్సు 80 ఏళ్లు మించినవారు) ఆదాయ పరిమితి రూ.5 లక్షలు వరకు పన్ను లేదు.

ఈ పరిమితిని మించిన వారికి మాత్రమే ఐటీఆర్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కనుక మీరు ఏ పన్ను విధానం ఎంచుకున్నారన్నది, అలాగే మీ వయస్సు ఆధారంగా ఐటీఆర్ దాఖలు చేయాల్సిన అవసరాన్ని నిర్ణయించుకోవాలి.

ఐటీఆర్ తప్పనిసరిగా దాఖలు చేయాల్సిన ప్రత్యేక సందర్భాలు

1. విదేశీ ప్రయాణ ఖర్చులు రూ.2 లక్షలకుపైగా అయితే

ఒక ఆర్థిక సంవత్సరంలో విదేశీ టూర్ కోసం మీరు రూ.2 లక్షలకు మించి ఖర్చు చేసినట్లయితే ఐటీఆర్ దాఖలు తప్పనిసరి. ఎందుకంటే ఆదాయపు మూలాన్ని సరిగా నిరూపించాల్సిన అవసరం ఉంటుంది.

2. కరెంట్ బిల్లు రూ.1 లక్ష దాటితే

మీ ఇల్లు లేదా బిజినెస్‌కు సంబంధించిన విద్యుత్ బిల్లు(Electricity Bill ) మొత్తం రూ.1 లక్షకు మించితే కూడా ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక్కసారిగా చెల్లించినా లేదా విడతలుగా అయినా సరే.

3. బ్యాంక్ డిపాజిట్ లిమిట్

మీ సేవింగ్స్ ఖాతాలో రూ.50 లక్షలకుపైగా డిపాజిట్ చేస్తే లేదా కరెంట్ అకౌంట్‌లో రూ.1 కోటి మించి డిపాజిట్ అయితే, ఐటీ రిటర్న్ తప్పనిసరిగా ఫైల్ చేయాల్సిందే.

ఈ విధంగా, ఆదాయం తక్కువగా ఉన్నా ఈ నిబంధనలు మీపై వర్తిస్తే ఐటీఆర్ తప్పకుండా దాఖలు చేయాలి. లేదంటే ఐటీ శాఖ నుండి నోటీసులు రావచ్చు. మీరు సురక్షితంగా ఉండాలంటే, మీ ఖర్చులు, ఆదాయాన్ని తరచూ పరిశీలించుకుంటూ ఉండటం మంచిది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *