బిహార్(Bihar)లో 65.2 లక్షల ఓటర్ల పేర్లు జాబితా(Voter names list) నుంచి తొలగించామని ఎన్నికల కమిషన్(Election Commission) ప్రకటించడం ఆ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. నెల రోజుల పాటు నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ తర్వాత, ఆగస్టు 1న ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 7.8 కోట్ల ఓటర్లలో 7.2 కోట్ల మంది తమ ఎన్యూమరేషన్ పత్రాల(Enumeration documents)ను సమర్పించగా, 91.6 శాతం పత్రాలు స్వీకరించినట్లు కమిషన్ తెలిపింది. అయితే, 65.2 లక్షల మంది ఓటు హక్కు(right to vote)ను తొలగించారు. ఇందులో 22 లక్షల మంది మరణించినవారు కాగా, 26 లక్షల మంది శాశ్వతంగా వలస వెళ్లినవారని, మరో 7 లక్షల మంది రెండు చోట్ల ఓటు నమోదు చేసుకున్నవారని ఎన్నికల కమిషన్ వెల్లడించింది.

అర్హులైన ఓటర్లకు నెల రోజుల గడువు
ఈ ప్రక్రియపై ప్రతిపక్షాలు(Opposition parties) తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఓటర్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు ప్రత్యేక పథకం అమలైందని ఆరోపించాయి. అయితే, ఎన్నికల కమిషన్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. వలస కార్మికులను జాబితా నుంచి తొలగించబోమని, 16 లక్షల మంది వలస కార్మికులు(Migrant workers) ఆన్‌లైన్‌లో పత్రాలు సమర్పించినట్లు స్పష్టం చేసింది. అర్హులైన ఓటర్లకు నెల రోజుల గడువు ఇచ్చామని, ఆందోళన అవసరం లేదని కమిషన్ పేర్కొంది. రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాయని, CPI(M), కాంగ్రెస్‌లు వంద శాతానికి పైగా ఏజెంట్లను పెంచాయని తెలిపింది. ఈ వివాదం బిహార్ రాజకీయాల్లో కీలక చర్చనీయాంశంగా మారింది.

అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 1లోగా తెలపండి
కాగా ముసాయిదా జాబితా(Draft list)ను ఈసీ తాజాగా విడుదల చేసింది. దీనిని ప్రధాన రాజకీయ పార్టీలకు అందజేసింది. తాజాగా ఓటర్లకు కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 1లోగా ECకి తెలియజేయవచ్చు. ఆ తర్వాత ఓటరు తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రచురిస్తుంది. ఈసీ చేపట్టిన SIRను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, ఆర్జేడీ వంటి విపక్ష పార్టీలు ఈ ముసాయిదాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
#NewDelhi | The Election Commission of India (ECI) on Friday released the draft electoral roll in Bihar, prepared under the Special Intensive Revision (SIR) process, amid strong Opposition from political parties.#BiharElections2025
https://t.co/KjyQNQJ0Mg— Deccan Chronicle (@DeccanChronicle) August 1, 2025






