సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘కూలీ(Coolie)’ ట్రైలర్ మొన్న (ఆగస్టు 2) చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఘనంగా విడుదలైన విషయం తెలిసిందే. లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14న పాన్ ఇండియా స్థాయిలో తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ మేరకు తాజాగా విడుదలైన ట్రైలర్(Trailer)లో రజినీకాంత్ ‘దేవా’ పాత్రలో స్టైలిష్ యాక్షన్‌తో అలరించగా, అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) సిమోన్ అనే గ్యాంబ్లర్‌గా నెగటివ్ షేడ్స్‌లో కనిపించారు. ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ కీలక పాత్రల్లో నటించారు.
గోల్డ్ స్మగ్లింగ్ చుట్టూ తిరిగే కథ
కాగా కూలీ ట్రైలర్ యూట్యూబ్(Youtube)ని షేక్ చేస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే 5 మిలియన్లకుపైగా వ్యూస్ దక్కించుకొని ట్రెండ్ సెట్ చేస్తోంది. ఇక ట్రైలర్‌లో రజినీకాంత్ ఎంట్రీ, నాగార్జున డైలాగ్‌లు హైలైట్‌గా నిలిచాయి. అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) సంగీతం ట్రైలర్‌కు బలం తెచ్చినప్పటికీ, కొందరు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. గోల్డ్ స్మగ్లింగ్ చుట్టూ తిరిగే కథ, లోకేష్ మార్క్ స్టైలిష్ టేకింగ్‌తో ట్రైలర్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది. అయితే, కొందరు టైమ్ ట్రావెల్ ఎలిమెంట్స్ ఉన్నట్లు ఊహించి, ఇవి మాస్ హీరోకు సరిపోతాయా అనే సందేహాలు వ్యక్తం చేశారు. సినిమాపై భారీ అంచనాలతో, ‘కూలీ’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉంది.






