హైదరాబాద్ నుంచి IRCTC స్పెషల్ టూర్.. అతి తక్కువ ధరకే చారిత్రక ప్రదేశాలు చుట్టేసే అవకాశం ఇది

ప్రకృతి ప్రేమికులు, చారిత్రక ప్రదేశాల సందర్శనలో ఆసక్తి ఉన్నవారికి శుభవార్త. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అందుబాటులోకి తెచ్చిన ప్రత్యేక ప్యాకేజీ ‘కాఫీ విత్ కర్ణాటక’ తో కేవలం రూ.12,000 ఖర్చుతో ఆరు రోజుల మధురమైన ట్రిప్‌ను అనుభవించవచ్చు. కూర్గ్, మైసూర్, చాముండి హిల్స్, మైసూర్ ప్యాలెస్, అబ్బె జలపాతం, కాఫీ తోటలు వంటి పర్యాటక ప్రదేశాల సందర్శనతో పాటు ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిన దేవాలయాలు కూడా ఈ టూర్‌లో భాగం.

టూర్ వివరాలు:
ఈ టూర్ హైదరాబాద్‌ నుంచి ప్రారంభమవుతుంది. కాచిగూడ, జడ్చర్ల, గద్వాల్‌, మహబూబ్‌నగర్‌, కర్నూలు, డోన్‌ మీదుగా ప్రయాణం సాగుతుంది. తిరుగు ప్రయాణంలోనూ అదే మార్గంలో హైదరాబాద్‌కు చేరుకుంటుంది.

ప్రయాణ షెడ్యూల్:
1వ రోజు: కాచిగూడ నుంచి రాత్రి 7 గంటలకు ట్రైన్ బయలుదేరుతుంది.

2వ రోజు: మైసూర్ చేరుకున్న తర్వాత కూర్గ్‌కి ప్రయాణం. అబ్బె జలపాతం, ఓంకారేశ్వర ఆలయం సందర్శన.

3వ రోజు: తలకావేరి, భాగమండలం, రాజా సీట్ పార్క్ లాంటి ప్రదేశాల సందర్శన.

4వ రోజు: మైసూర్‌కి తిరుగు ప్రయాణం. మార్గమధ్యంలో కావేరి నిసర్గధామ, టిబెటన్ మానెస్టరీ, బృందావన్ గార్డెన్స్ సందర్శన.

5వ రోజు: చాముండి హిల్స్‌, మైసూర్ ప్యాలెస్ సందర్శన. మధ్యాహ్నం మైసూర్ స్టేషన్ నుంచి తిరుగు ప్రయాణం.

6వ రోజు: ఉదయం కాచిగూడ చేరుకోవడం.

ప్యాకేజీ ధరలు (ఒక్కో వ్యక్తికి):
కంఫర్ట్ క్లాస్ (3AC):
సింగిల్ షేరింగ్: ₹33,160

డబుల్ షేరింగ్: ₹18,730

ట్రిపుల్ షేరింగ్: ₹14,690

పిల్లలు (బెడ్‌తో): ₹11,140

పిల్లలు (బెడ్ లేకుండా): ₹9,530

స్టాండర్డ్ క్లాస్ (SL):
సింగిల్ షేరింగ్: ₹31,140

డబుల్ షేరింగ్: ₹16,710

ట్రిపుల్ షేరింగ్: ₹12,670

పిల్లలు (బెడ్‌తో): ₹9,120

పిల్లలు (బెడ్ లేకుండా): ₹7,510

ప్యాకేజీలో లభించే సదుపాయాలు:
3AC లేదా SL క్లాస్‌లో రైలు ప్రయాణం ఉంటుంది. అలాగే నాన్ A/C ట్రావెల్ వెహికల్స్ ద్వారా లోకల్ ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం కల్పిస్తారు. హోటల్ బస (స్టాండర్డ్ రూములు), బ్రేక్‌ఫాస్ట్‌లు వాళ్లే చూసుకుంటారు. ప్రయాణికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. టోల్, పార్కింగ్, లోకల్ గైడ్ ఖర్చులు కూడా ఇందులోనే కవర్ అవుతాయి.

టూర్ ఎప్పుడుంటుంది?
ఈ టూర్ జూలై 9 నుంచి ఆగస్టు 27 వరకు ప్రతి బుధవారం ప్రారంభమవుతుంది.

బుకింగ్ ఎలా చేయాలి?
ఈ ప్యాకేజీని IRCTC అధికారిక వెబ్‌సైట్ (www.irctctourism.com) ద్వారా బుక్ చేసుకోవచ్చు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *