TeamIndia: డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్.. మూడో స్థానంలోకి గిల్ సేన

టీమ్ ఇండియా(TeamIndia) 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ర్యాంకింగలో మూడో స్థానానికి చేరుకుంది, ఇంగ్లాండ్‌(England)పై ఓవల్‌లో ఉత్కంఠగా జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో 6 పరుగుల అద్భుత విజయంతో ఈ ఘనత సాధించింది. ఈ విజయం అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ(Anderson-Tendulkar Trophy) సిరీస్‌ను 2-2తో సమం చేసింది. అదే సమయంలో భారత జట్టు WTCలో గణనీయమైన పురోగతి సాధించింది. ఐదు మ్యాచ్‌ల నుంచి 28 పాయింట్లతో భారత్ 46.67 శాతం(PCT) పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ను వెనక్కి నెట్టింది. దీంతో ఇంగ్లిష్ జట్టు 26 పాయింట్లతో 43.33 PCTతో నాలుగో స్థానానికి పడిపోయింది.

టాప్‌-2లో ఆస్ట్రేలియా, శ్రీలంక

ఇంగ్లాండ్‌కు లార్డ్స్ టెస్ట్‌లో స్లో ఓవర్ రేట్(Slow Over Rate) కారణంగా రెండు పాయింట్ల జరిమానా విధించడంతో ఆ జట్టు నాలుగో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా(Australia) 100 PCTతో టేబుల్‌లో అగ్రస్థానంలో ఉంది. వెస్టిండీస్‌పై 3-0 సిరీస్ విజయంతో ఆ జట్టు మెరుగైన స్థానంలో నిలిచింది. ఆ తర్వాత శ్రీలంక(Srilanka) 66.67 PCTతో రెండవ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ ఐదవ స్థానంలో, వెస్టిండీస్ ఆరవ స్థానంలో ఉన్నాయి, న్యూజిలాండ్, పాకిస్థాన్, డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ ఆఫ్రికా ఇంకా ఈ సైకిల్‌లో ఆడలేదు. కాగా ఈ విజయం భారత జట్టుకు డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌లో బలమైన పునాది వేసింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *