PM Modi: నేడు కర్ణాటకలో పర్యటించనున్న ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Modi) నేడు (ఆగస్టు 10) కర్ణాటక రాజధాని బెంగళూరు(Bangalore)లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల(Development projects)ను ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు కేఎస్ఆర్ రైల్వే స్టేషన్‌(KSR Railway Station)లో మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల(Vande Bharat Express trains)ను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఇవి బెంగళూరు-బెలగావి, అమృత్‌సర్-శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా, నాగ్‌పూర్ (అజ్నీ)-పుణే మధ్య నడుస్తాయి. అనంతరం, బెంగళూరు మెట్రోకు సంబంధఇంచి ఎల్లో లైన్‌ను (ఆర్‌వీ రోడ్ నుంచి బొమ్మసంద్ర వరకు) ప్రారంభించి, RV రోడ్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వరకు మెట్రో ప్రయాణం చేస్తారు. ఈ ఎల్లో లైన్ 19.15 కిలోమీటర్లు కాగా, 16 స్టేషన్లతో రూ. 7,160 కోట్లతో నిర్మించారు. దీనితో బెంగళూరు మెట్రో నెట్‌వర్క్ 96 కి.మీ.కు విస్తరిస్తుంది.

బెంగళూరులో ట్రాఫిక్ ఆంక్షలు

ఇక మధ్యాహ్నం 1 గంటలకు, మోదీ బెంగళూరు మెట్రో ఫేజ్-3 ప్రాజెక్టు (44KM, 31 ఎలివేటెడ్ స్టేషన్లు, రూ. 15,610 కోట్లు) శంకుస్థాపన చేస్తారు. అదే సమయంలో పట్టణ కనెక్టివిటీ(Urban connectivity) ప్రాజెక్టులను ప్రారంభించి ప్రజా సభలో ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా బెంగళూరులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా మారెనహళ్లి, సిల్క్ బోర్డ్, హోసూర్ రోడ్‌లలో ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఈ ప్రాజెక్టులు బెంగళూరు రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తాయని భావిస్తున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *