తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్(Telugu Film Industry Employees Federation) కార్యాలయం వద్ద సినీ కార్మికులు(Film workers) ఆదివారం (ఆగస్టు 10) ఉదయం భారీ ఆందోళన(huge concern) చేపట్టారు. 30 శాతం వేతన పెంపు డిమాండ్‌తో ఏడు రోజులుగా కొనసాగుతున్న సమ్మె(Strike)లో భాగంగా, 24 క్రాఫ్ట్ విభాగాల కార్మికులు అన్నపూర్ణ 7 ఎకర్స్(Annapurna 7 acres)లోని యూనియన్ కార్యాలయం నుంచి ఫెడరేషన్ కార్యాలయం వరకు ర్యాలీ(Rally) నిర్వహించారు. నిర్మాతలతో శనివారం జరిగిన చర్చలు విఫలమవడంతో కార్మికులు తమ ఆందోళనను ఉద్ధృతం చేశారు. నిర్మాతలు వేతనాలను మూడు కేటగిరీలుగా విభజించి పెంచాలని ప్రతిపాదించగా, కార్మిక సంఘాలు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశాయి.
లీగల్ నోటీసులుపై కార్మికుల ఆగ్రహం
కాగా అందరికీ సమానంగా 30 శాతం పెంపు, రోజుకు రోజు చెల్లింపు డిమాండ్‌ను నిర్మాతలు(Producers) అంగీకరించలేదని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని ఆరోపించారు. నిర్మాత టి.జి. విశ్వప్రసాద్(Producer T.G. Vishwaprasad) సిటీ సివిల్ కోర్టులో కేసు వేసి, యూనియన్ నాయకులకు లీగల్ నోటీసులు(Legal Notice) పంపడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమ్మె కారణంగా టాలీవుడ్(Tollywood)లో షూటింగ్‌లు స్తంభించాయి, ఇది పరిశ్రమకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తోంది.
ఇదిలా ఉండగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Telangana Cinematography Minister Komatireddy Venkata Reddy)తో కార్మికులు చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. సమస్య పరిష్కారం కోసం చిరంజీవి(Chiranjeevi), బాలకృష్ణ(Balakrishna) దిల్ రాజు(Dil Raju) వంటి ప్రముఖుల సహకారం కోరుతున్నారు. చర్చలు సఫలమైతే సమ్మె విరమించే అవకాశం ఉందని కార్మికులు తెలిపారు.






