Film Employees Protest: ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫీస్‌ వద్ద ఆందోళన సినీ కార్మికుల ఆందోళన

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్(Telugu Film Industry Employees Federation) కార్యాలయం వద్ద సినీ కార్మికులు(Film workers) ఆదివారం (ఆగస్టు 10) ఉదయం భారీ ఆందోళన(huge concern) చేపట్టారు. 30 శాతం వేతన పెంపు డిమాండ్‌తో ఏడు రోజులుగా కొనసాగుతున్న సమ్మె(Strike)లో భాగంగా, 24 క్రాఫ్ట్ విభాగాల కార్మికులు అన్నపూర్ణ 7 ఎకర్స్‌(Annapurna 7 acres)లోని యూనియన్ కార్యాలయం నుంచి ఫెడరేషన్ కార్యాలయం వరకు ర్యాలీ(Rally) నిర్వహించారు. నిర్మాతలతో శనివారం జరిగిన చర్చలు విఫలమవడంతో కార్మికులు తమ ఆందోళనను ఉద్ధృతం చేశారు. నిర్మాతలు వేతనాలను మూడు కేటగిరీలుగా విభజించి పెంచాలని ప్రతిపాదించగా, కార్మిక సంఘాలు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశాయి.

లీగల్ నోటీసులుపై కార్మికుల ఆగ్రహం

కాగా అందరికీ సమానంగా 30 శాతం పెంపు, రోజుకు రోజు చెల్లింపు డిమాండ్‌ను నిర్మాతలు(Producers) అంగీకరించలేదని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని ఆరోపించారు. నిర్మాత టి.జి. విశ్వప్రసాద్(Producer T.G. Vishwaprasad) సిటీ సివిల్ కోర్టులో కేసు వేసి, యూనియన్ నాయకులకు లీగల్ నోటీసులు(Legal Notice) పంపడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమ్మె కారణంగా టాలీవుడ్‌(Tollywood)లో షూటింగ్‌లు స్తంభించాయి, ఇది పరిశ్రమకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తోంది.

ఇదిలా ఉండగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Telangana Cinematography Minister Komatireddy Venkata Reddy)తో కార్మికులు చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. సమస్య పరిష్కారం కోసం చిరంజీవి(Chiranjeevi), బాలకృష్ణ(Balakrishna) దిల్ రాజు(Dil Raju) వంటి ప్రముఖుల సహకారం కోరుతున్నారు. చర్చలు సఫలమైతే సమ్మె విరమించే అవకాశం ఉందని కార్మికులు తెలిపారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *