La Ganesan: నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ కన్నుమూత

నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ (Nagaland Governor La Ganesan) చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆగస్టు 8న చెన్నైలోని తన నివాసంలో జారిపడి తలకు తీవ్ర గాయమైన ఆయన, అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చేరారు. ICUలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నప్పటికీ, ఆయన ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం సాయంత్రం మరణించారు. 1945 ఫిబ్రవరి 16న తమిళనాడు(Tamilnadu)లోని తంజావూరులో జన్మించిన గణేశన్(80), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) భావజాలంతో చిన్న వయసులోనే ఆకర్షితులై, 1970లో పూర్తిస్థాయి ప్రచారక్‌గా మారారు.

గణేశన్ మరణంపై ప్రధాని మోదీ సంతాపం

ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరి, తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ స్థాయిలో వివిధ హోదాల్లో సేవలందించారు. 2016లో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడి(Member of Rajya Sabha)గా ఎన్నికయ్యారు. 2021లో మణిపూర్ గవర్నర్‌(Governor of Manipur)గా, 2022లో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. 2023 ఫిబ్రవరి నుంచి నాగాలాండ్ 19వ గవర్నర్‌గా పనిచేశారు. గణేశన్ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయనను నిబద్ధత గల జాతీయవాదిగా, తమిళ సంస్కృతి పట్ల అంకితభావం ఉన్న వ్యక్తిగా కొనియాడారు.

గణేశన్ మృతి పట్ల రాష్ట్రపతి ముర్ము, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఆ రాష్ట్ర బీజేపీ నేత కే. అన్నామలై సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. గణేశన్ సేవలు రాజకీయ, సామాజిక రంగాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పలువురు కొనియాడారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *