Jasprit Bumrah: ఆసియా కప్‌-2025కి బుమ్రా రెడీ.. జట్టు ఇదేనా?

ఆసియా కప్(Asia Cup 2025) కోసం భారత క్రికెట్ జట్టు(Team India) సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌(UAE)లో T20 ఫార్మాట్‌లో జరగనుంది. ఈ సందర్భంగా భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadhav) నేతృత్వంలో సిద్ధమవుతోంది. అయితే, అభిమానులకు సూపర్ న్యూస్ వచ్చేసింది. టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఈ టోర్నమెంట్‌లో ఆడే అవకాశం ఉంది. ఈ మేరకు బుమ్రా తాజాగా BCCIకి సమాచారం ఇచ్చాడని, ఆసియా కప్‌ సెలక్షన్‌కి అందుబాటులో ఉంటానని చెప్పినట్లు క్రీడావర్గాలు పేర్కొన్నాయి.

బుమ్రా ఎంట్రీ బౌలింగ్ యూనిట్‌కు ప్లస్

టీ20లలో మంచి రికార్డు ఉన్న బుమ్రా ఆడడం టీమ్ ఇండియాకు చాలా ప్లస్ అవుతుంది. ఇక ఈ టోర్నమెంట్ నేపథ్యంలో మహమ్మద్ సిరాజ్(Siraj)కు ఛాన్స్ లేదనే తెలుస్తోంది. బుమ్రాతో పాటు అర్ష్ దీప్(Arshdeep SIngh) బౌలర్ గా రంగంలోకి దిగనున్నాడట. ఇక హార్దిక్ పాండ్య అలాగే శివం దూబే.. ఆల్ రౌండర్లుగా బరిలోకి దిగనున్నారు. ఓపెనర్లుగా సంజు, అభిషేక్ శర్మ ఉండే ఛాన్స్ ఉంది. విరాట్ కోహ్లీ తరహాలో ఫస్ట్ డౌన్ లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ బరిలోకి దిగుతాడు. రింకూ స్థానంలో జితేష్ శర్మ ఫినిషర్‌గా రాబోతున్నట్లు తెలుస్తోంది. బుమ్రాతో పాటు, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ పేస్ బౌలర్లు బౌలింగ్ విభాగాన్ని హ్యాండిల్ చేయవచ్చు. అయితే బుమ్రా లేని సందర్భంలో ఖలీల్ అహ్మద్‌కు ఛాన్స్ దక్కొచ్చు. కాగా BCCI ఆగస్టు 19న జట్టును ప్రకటించనుంది.

భారత జట్టు అంచనా

అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (C), శుభమన్ గిల్, రింకూ సింగ్, సంజూ శాంసన్(Wk), జితేశ్ శర్మ(Wk), హర్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే/ నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి/ కుల్దీప్ యాదవ్.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *