Suriya: ‘సూర్య46’ నుంచి మరో అప్డేట్.. ఫ్లాష్‌బ్యాక్ ప్రముఖ నటుడు ఎంట్రీ!

తమిళ స్టార్ హీరో సూర్య(Suriya), తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి(Venky Atloori) కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘Siriya46’. ఈ మూవీ నుంచి తాజా అప్‌డేట్ ఆసక్తి రేపుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ(Nagavamsi) నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా సూర్య కెరీర్‌లో 46వ చిత్రంగా రూపొందుతుండగా, వెంకీ అట్లూరి గత చిత్రాలైన ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ విజయాలతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఫ్యామిలీ డ్రామాతో

తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి ‘విశ్వనాథన్ అండ్ సన్స్(Viswanathan & Sons)’ అనే ఆసక్తికర టైటిల్‌ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారని టాక్. ఈ సినిమా ఫ్యామిలీ డ్రామాతో కూడిన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. సూర్య సరసన ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు(Mamita Baiju) హీరోయిన్‌గా నటిస్తుండగా, రవీనా టాండన్(Raveena Tandon), రాధికా శరత్ కుమార్(Radhika Sarath Kumar) కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది.

ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో అనిల్ కపూర్

ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీ(Ramoji Film City)లో సూర్యపై ఒక సోలో సాంగ్‌ను చిత్రీకరించారు. దీని తర్వాత హై-ఎనర్జీ యాక్షన్ సీక్వెన్స్‌లను షూట్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అనిల్ కపూర్(Anil Kapoor) ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమా 2026 సమ్మర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. సూర్య తెలుగులో నేరుగా నటిస్తున్న తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

Related Posts

మళ్లీ భారత్‌లోకి టిక్‌టాక్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం..

2020 గాల్వన్ లోయ ఘటన తర్వాత భారత్–చైనా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలోనే భారత ప్రభుత్వం డేటా భద్రత, గోప్యతా సమస్యలను ప్రస్తావిస్తూ పలు చైనా యాప్‌లపై నిషేధం విధించింది. టిక్‌టాక్(TikTok), అలీ ఎక్స్‌ప్రెస్(ali Express), షీన్(Sheein) వంటి…

BIGG BOSS-S9: బుల్లితెర ప్రేక్షకులకు అదిరిపోయే న్యూస్.. వచ్చే నెల 7 బిగ్‌బాస్-9 షురూ

తెలుగు టెలివిజన్ రియాలిటీ షోలలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘బిగ్ బాస్(Bigg Boss) తెలుగు’ సీజన్ 9(BB-9) సెప్టెంబర్ 7 నుంచి ఆరంభం కానుంది. స్టార్ మా(Star Maa), జియో హాట్‌స్టార్‌(Jio Hotstar)లో ప్రసారం కానున్న ఈ షోను అక్కినేని నాగార్జున(Nagarjuna…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *