OG Update: ఈనెల 27న పవన్ ‘ఓజీ’ మూవీ నుంచి రెండో సాంగ్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న భారీ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘ఓజీ’ (They Call Him OG) సినిమా నుంచి రెండో సాంగ్(Second Song) ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా విడుదల కానుంది. సుజీత్(Sujit) దర్శకత్వంలో DVV ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రం, తెలుగు సినిమా పరిశ్రమలో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఈ రెండో సాంగ్ పవన్ కల్యాణ్, ప్రియాంక మోహన్‌(Priyanka Mohanan)లపై చిత్రీకరించిన మెలోడీ ట్రాక్‌గా తెలుస్తోంది.

విలన్ రోల్‌లో బాలీవుడ్ స్టార్ యాక్టర్

ఇక ఈ మూవీలో ప్రియాంక మోహన్ ఈ చిత్రంలో కన్మణి(Kanmani) అనే పాత్రలో కనిపించనుంది. ఈ పాట ఆమె క్యారెక్టర్‌కు అంకితమిచ్చారని సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సాంగ్‌కు అభిమానులతో పాటు సంగీత ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘ఫైర్‌స్టార్మ్’ అద్భుతమైన స్పందనను రాబట్టింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ(Imran Hashmi) విలన్‌గా, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Image

సెప్టెంబర్ 2న స్పెషల్ యాక్షన్ టీజర్

ముంబై నేపథ్యంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పవన్ కల్యాణ్ ‘ఓజస్ గంభీర(Ojas Gambhira)’ అనే రౌద్రమైన డాన్ పాత్రలో కనిపించనున్నారు. రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్‌తో ఈ చిత్రం సాంకేతికంగా కూడా ఉన్నతంగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఈ సాంగ్ రిలీజ్ అప్‌డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు(Pawan Kalyan’s Birth Day) సందర్భంగా స్పెషల్ యాక్షన్ టీజర్(Teaser) కూడా విడుదల కానుందని తెలుస్తోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *