Cheteshwar Pujara: క్రికెట్‌కు టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా గుడ్‌బై

టీమ్ఇండియా(Team India) స్టార్ ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara) అంతర్జాతీయ సహా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు(Retirement) పలికాడు. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ Xలో ఓ పోస్ట్‌ ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. “భారత జెర్సీ ధరించడం, జాతీయ గీతం పాడటం, గ్రౌండ్‌లో అడుగుపెట్టిన ప్రతీసారీ నా శాయశక్తులా ఆడేందుకు ప్రయత్నించా. అవకాశాలు కల్పించిన BCCI, సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌, నా జట్లు, ఫ్రాంచైజీలకు కృతజ్ఞతలు” అని పుజారా రాసుకొచ్చాడు.

ద్రవిడ్ వారసుడిగా గుర్తింపు

కాగా పుజారా(Pujara) భారత్‌ తరఫున 103 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడి 7,195 రన్స్‌ సాధించారు. ఇందులో 19 సెంచరీలు, 35 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్‌ క్రికెట్‌(Test Cricket)లో ఆయన అత్యధిక స్కోరు 206 నాటౌట్‌. అలాగే, 5 వన్డే మ్యాచ్‌లు ఆడి 51 రన్స్‌ చేశారు. 2023లో ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌(World Test Championship) ఆయన చివరి టెస్ట్‌ మ్యాచ్‌. టెస్ట్‌ క్రికెట్‌లో తన రక్షణాత్మక బ్యాటింగ్‌తో రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) వారసుడిగా ‘ది వాల్‌’గా పేరొందిన పుజారా.. జట్టు టాప్ ఆర్డర్‌లో కీలక పాత్ర పోషించాడు.

అద్భుత బ్యాటింగ్‌‌తో భారత్‌కు విజయాలు

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌(England)లలో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లలో ఆయన అద్భుత బ్యాటింగ్‌‌తో భారత్‌కు విజయాలు అందించాడు. సౌరాష్ట్ర(Saurashtra) తరఫున దేశవాళీ క్రికెట్‌(Domestic Cricket)లోనూ పుజారా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. రంజీ ట్రోఫీ(Ranji Trophy)లో ఆయన స్థిరమైన స్కోరర్‌గా రాణించాడు. IPLలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB), కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌(KIXP) వంటి ఫ్రాంచైజీలకు ఆడాడు. రిటైర్మెంట్‌తో పుజారా తన 17 ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌కు తెరదించారు. ఆయన నిష్క్రమణ భారత క్రికెట్‌లో ఒక శకానికి ముగింపు పలికినట్లయింది.కాగా పుజారాకు భవిష్యత్తులో అంతా మంచి జరగాలని, భారత క్రికెట్‌కు అతడి సేవలు కొత్తతరానికి ఆదర్శంగా నిలుస్తాయని మాజీ క్రికెటర్లు, బీసీసీఐ పెద్దలు పేర్కొన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *