Road Accident: పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా ప్రమాదం.. 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌(UP)లోని బులంద్‌శహర్-అలీగఢ్ సరిహద్దు(Bulandshahr-Aligarh border)లో సోమవారం (ఆగస్టు 25) తెల్లవారుజామున 2:15 గంటల సమయంలో ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని జహర్‌పీర్ (గోగాజీ) పుణ్యక్షేత్రానికి యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ(Tractor trolley)ని వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ ట్రక్కు(Container truck) బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒక చిన్నారి, ఇద్దరు మహిళలతో సహా 8 మంది యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందగా, 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాస్‌గంజ్ జిల్లాకు చెందిన సుమారు 61 మంది యాత్రికులు ఆదివారం సాయంత్రం ట్రాక్టర్ ట్రాలీలో బయలుదేరారు. జాతీయ రహదారి-34పై ఘటల్ గ్రామం సమీపంలో ప్రమాదం సంభవించింది. అతివేగంతో వచ్చిన కంటైనర్ ట్రక్కు ఢీకొట్టడంతో ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి బోల్తా కొట్టింది.

మరో ముగ్గురి పరిస్థితి విషమం

సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్, ఎస్ఎస్పీతో సహా పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ ట్రక్కును పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. క్రేన్ సహాయంతో ట్రాక్టర్‌ను రహదారి నుంచి తొలగించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *