Team India: టీమ్ఇండియా స్పాన్సర్‌షిప్ రేసులో టయోటా?

టీమ్ ఇండియా(Team India) జెర్సీ స్పాన్సర్‌షిప్(Jersey sponsorship) కోసం జపాన్‌కు చెందిన టయోటా మోటార్ కార్పొరేషన్(Toyota Motor Corporation) ఆసక్తి చూపిస్తోందని క్రీడావర్గాలు పేర్కొన్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) డ్రీమ్11తో రూ.358 కోట్ల స్పాన్సర్‌షిప్ ఒప్పందం ముగిసిన తర్వాత కొత్త స్పాన్సర్ కోసం వెతుకుతోంది. ఇటీవల భారత పార్లమెంట్‌లో ఆమోదం పొందిన ‘ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్ (Online Gaming Promotion and Regulation Bill 2025)’ కారణంగా రియల్-మనీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం విధించడంతో డ్రీమ్11 ఒప్పందాన్ని ముగించింది. ఈ నేపథ్యంలో, Asia Cup 2025 సమీపిస్తున్న వేళ, BCCI కొత్త స్పాన్సర్‌ను త్వరగా కనుగొనాల్సిన ఒత్తిడిలో ఉంది. టయోటాతో పాటు, ఒక ఫిన్‌టెక్ స్టార్టప్ కూడా ఈ రేసులో ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, అధికారిక టెండరింగ్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు.

స్పాన్సర్ దొరకకపోతే ఎలా

కాగా బీసీసీఐ Dream-11తో ఉన్న మునుపటి ఒప్పందం కంటే ఎక్కువ విలువైన ఒప్పందాన్ని ఆశిస్తోంది. ఆసియా కప్ సెప్టెంబర్ 9న UAEలో ప్రారంభమవుతుంది, ఇందులో భారత్-పాకిస్తాన్(India vs Pakistan) మ్యాచ్ వంటి హై-ప్రొఫైల్ గేమ్‌లు ఉంటాయి. ఇవి స్పాన్సర్‌లకు అపారమైన గుర్తింపును అందిస్తాయి. డ్రీమ్11 లోగోతో ఇప్పటికే తయారైన జెర్సీలు ఉపయోగించమవని, కొత్త స్పాన్సర్ కోసం తాజా జెర్సీలు తయారు చేయాల్సి ఉంటుందని సమాచారం. ఒకవేళ కొత్త స్పాన్సర్(New Sponsor)సమయానికి ఖరారు కాకపోతే, టీమ్ ఇండియా గత మూడు దశాబ్దాలలో లేని విధంగా స్పాన్సర్ లేకుండా ఆడవలసి రావచ్చు. టయోటా లాంటి గ్లోబల్ బ్రాండ్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే, భారత క్రికెట్ జట్టుకు కొత్త గుర్తింపు లభించనుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *