తెలుగు టెలివిజన్ రియాలిటీ షోలలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘బిగ్ బాస్(Bigg Boss) తెలుగు’ సీజన్ 9(BB-9) సెప్టెంబర్ 7 నుంచి ఆరంభం కానుంది. స్టార్ మా(Star Maa), జియో హాట్‌స్టార్(Jio Hotstar)లో ప్రసారం కానున్న ఈ షోను అక్కినేని నాగార్జున(Nagarjuna Akkineni) వరుసగా ఏడోసారి హోస్ట్ చేయనున్నారు. ఈ సీజన్లో సెలబ్రిటీలతో పాటు సామాన్య ప్రజలు కూడా పాల్గొనడం విశేషం. ఇది షోకు న్యూ హైప్ లభిస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ సీజన్లో కొత్త ట్విస్ట్‌గా ‘డబుల్ హౌస్(Double House)’ కాన్సెప్ట్‌ను పరిచయం చేశారు. ఇందులో ఒక హౌస్‌లో సెలబ్రిటీలు, మరోదాంట్లో సామాన్యులు ఉంటారు. ఈ రెండు గృహాల మధ్య డైనమిక్స్, టాస్క్‌లు, సవాళ్లు షోకు మరింత ఉత్కంఠ జోడిస్తాయని అంటున్నారు.
45 మంది సామాన్యుల నుంచి ఆరుగురు ఎంపిక
సామాన్య ప్రజల(Commoners)ను ఎంపిక చేయడానికి ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 5 వరకు ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష(Bigg Boss Agnipariksha)’ అనే డిజిటల్ ప్రీ-షో జియో హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. ఈ షోలో 45 మంది సామాన్యుల నుంచి ఆరుగురు ఎంపికవుతారు. వీరిని నవదీప్(Navadeep), అభిజీత్, బిందు మాధవి న్యాయనిర్ణేతలుగా ఎంచుకుంటారు. శ్రీముఖి(Sreemukhi) ఈ ప్రీ-షోను హోస్ట్ చేస్తున్నారు.
మరింత ఉత్సాహాన్ని అందించడం పక్కా
ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, నటులు, యూట్యూబర్లు ఈ సీజన్లో పాల్గొనే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. సుమంత్ అశ్విన్, కావ్య శ్రీ, రీతూ చౌదరి(Reethu Chaudari) వంటి పేర్లు చర్చలో ఉన్నాయి. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ అధిక TRP రేటింగ్‌లు అందించేలా ఈ షోని డిజైన్ చేశారు. కొత్త టాస్క్‌లు, డ్రామా, ఎంటర్టైన్మెంట్తో రూపొందించిన ఈ సీజన్ అభిమానులకు మరింత ఉత్సాహాన్ని అందించడం పక్కా అని నాగ్ ఇప్పటికే ప్రటించారు.








