BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది. ఈ జంట క్వార్టర్‌ఫైనల్స్‌లో 21-12, 21-19తో మలేసియాకు చెందిన ఆరోన్‌ చియా, సో వూయి ఇక్‌ జోడీపై విజయం సాధించింది. తొలగేమ్ నుంచే ఆధిపత్యం చెలాయించిన ఈ జోడీ ప్రత్యర్థులను మట్టికరిపించి సెమీస్‌లో స్థానం సంపాదించింది. వారి సమన్వయం, శక్తివంతమైన స్మాష్‌లు, వ్యూహాత్మక ఆటతీరు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ విజయంతో భారత్‌కు కనీసం కాంస్య పతకం ఖాయమైంది.

సింధుకు మళ్లీ నిరాశే..

మరోవైపు, మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu) క్వార్టర్‌ఫైనల్స్‌లో ఓటమితో నిష్క్రమించింది. క్వార్టర్‌ఫైనల్లో ఆమె 14-21, 21-13, 16-21తో రెండో సీడ్ పుత్రి కుసుమవర్దని (Indonasia) చేతిలో పోరాడి ఓడింది. కీలక సమయాల్లో ఒత్తిడిని అధిగమిస్తూ పాయింట్లు రాబట్టిన 23 ఏళ్ల కుసుమవర్దని.. కెరీర్‌లో మొదటి ప్రపంచ పతకాన్ని ఖాయం చేసుకుంది. తొలి గేమ్‌లో గొప్పగా పోరాడిన సింధు రెండు, మూడు సెట్లలో దారుణంగా విఫలమైంది. ఇతర భారత ఆటగాళ్లలో ధ్రువ్ కపిలా-తనీషా క్రాస్టో జోడీ కూడా క్వార్టర్స్‌లో ఓడిపోయింది. సాత్విక్-చిరాగ్ జోడీ సెమీఫైనల్ ప్రదర్శనపై ఇప్పుడు భారత అభిమానుల ఆశలు నెలకొన్నాయి. వారు అదే ఫామ్ కొనసాగిస్తే భారత్‌కు మరో చారిత్రక విజయం దక్కే అవకాశం ఉంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *