Jyoti team: ఫైనల్లో జ్యోతి బృందం

ఆర్చరీ వరల్డ్‌కప్‌ స్టేజ్‌-4 పోటీల కాంపౌండ్‌ విభాగంలో భారత మహిళలు, పురుషుల జట్లు ఫైనల్స్‌కు దూసుకెళ్లి కనీసం రజత పతకాలు ఖరారు చేసుకున్నాయి.

పారిస్‌: ఆర్చరీ వరల్డ్‌కప్‌ స్టేజ్‌-4 పోటీల కాంపౌండ్‌ విభాగంలో భారత మహిళలు, పురుషుల జట్లు ఫైనల్స్‌కు దూసుకెళ్లి కనీసం రజత పతకాలు ఖరారు చేసుకున్నాయి. బుధవారం జరిగిన మహిళల కాంపౌండ్‌ టీమ్‌ ఈవెంట్‌ సెమీస్‌లో వెన్నం జ్యోతి సురేఖ, అదితి, పర్నీత్‌ కౌర్‌లతో కూడిన బృందం 234-233తో బ్రిటన్‌పై నెగ్గింది. టాప్‌ సీడ్‌ జ్యోతి త్రయం ఫైనల్లో మెక్సికోతో తలపడనుంది.

పురుషుల టీమ్‌ ఈవెంట్‌ సెమీస్‌లో ఓజాస్‌ ప్రవీణ్‌ డియోటలే, ప్రథమేష్‌, అభిషేక్‌ వర్మలతో కూడిన భారత జట్టు కొరియాపై గెలిచింది. తొలుత 235-235తో ఇరు జట్ల స్కోర్లు సమం కాగా, అనంతరం షుటౌట్‌లోనూ 30-30తో టై అయింది. దీంతో రెఫరీలు బుల్‌ ఐకి దగ్గరగా విల్లులు సంధించిన భారత బృందాన్ని విజేతగా ప్రకటించారు. స్వర్ణ పోరులో అమెరికాను భారత జట్టు ఢీకొననుంది.

  • Related Posts

    BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

    పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

    PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

    క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *