మన ఈనాడు:
ఆయన ఏది చేసినా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలస్తుంది. ఆయన మాట్లాడితే చిన్న, పెద్ద అంతా కేరింతలు కొట్టాల్సిందే. మంత్రి మల్లారెడ్డి విజయదశమి సందర్భంగా గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. 40 సంవత్సరాల క్రితం నాటి జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకుని యువకుడిలా మారిపోయారు. బోయిన్ పల్లిలో విజయదశమి సందర్భంగా మల్లారెడ్డి ఆయుధ పూజ నిర్వహించారు.
మంత్రి మల్లారెడ్డి విజయదశమి సందర్భంగా గత స్మృతులను గుర్తు తెచ్చుకున్నారు. 40 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. బోయిన్ పల్లిలో విజయదశమి సందర్భంగా మల్లారెడ్డి ఆయుధ పూజ నిర్వహించారు. ఆ సమయంలో తాను యువకుడిగా ఉన్నప్పుడు ఉపయోగించిన స్కూటర్‌కు సైతం పూజ చేశారు.
పాలమ్మినా..మంత్రి అయినా!
స్కూటర్‌పై చక్కర్లు కొట్టి ఫోటోలకు ఫోజులిచ్చారు. గతంలో పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డానంటూ మల్లారెడ్డి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాను పాలమ్మినా స్కూటర్‌పైనే పూజ చేసి దానిపై చక్కర్లు కొట్టారు. మరోసారి తాను పాలమ్మి ఈ స్థాయికి వచ్చిన విషయాన్ని మంత్రి మల్లారెడ్డి మరోసారి గుర్తు చేసుకున్నారు.






