AP ప్రజలకు CM గుడ్​ న్యూస్​

మన ఈనాడు:

గురువారం ఏపీ కర్నూలు ఎమ్మిగనూరులో జగనన్న చేదోడు కార్యక్రమంలో CM జగన్ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రజక, నాయీ బ్రహ్మణ, టైలర్ల జీవితాల్లో మార్పు రావాలని వరుసగా నాలుగో ఏడాది ఈ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోన్నట్లు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 3,25,020 మందికి రూ. 325.02 కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జగనన్న చేదోడు పథకం ద్వారా అర్హులైన రజకులు, నాయీ బ్రహ్మణ, టైలర్లకు ప్రతి సంవత్సరం రూ. 10 వేలు చొప్పున సాయం అందిస్తున్నారు. ఈ ఏడాది వేసే నగదుతో కలిపి ఇప్పటి వరకు వారి ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ. 40 వేలు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు జగన్​ ప్రభుత్వం తెలిపింది.

గడిచిన నాలుగేళ్లుగా గవర్నమెంట్​ అందించే సాయం మొత్తం కలిపి రూ. 1,252.52 కోట్లుగా ఉందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద 1,80,656 మంది టైలర్లకు ఈసారి రూ. 180.66 కోట్ల లబ్ధి చేకూరుతుందని అధికారులు పేర్కొన్నారు. నాయీ బ్రహ్మణులకు రూ. 39.81 కోట్లు, 1,04,551 మంది రజకులకు రూ.104.55 కోట్లు సాయం అందనుంది.

ఇప్పటికే గ్రామాల్లోని సచివాలయాల్లో అర్హులైన వారి జాబితాను ఉంచారు. అర్హులైన వారందరికీ కూడా సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. అర్హులైన వారికి ఎవరికైనా ఈ విడతలో సంక్షేమ పథకం అందనట్లయితే..వారికి మరోసారి అంటే జూన్, డిసెంబర్‌ లో నగదు అందజేస్తామని అధికారులు వివరించారు.

జగనన్న చేదోడు పథకం క్రింద ఇప్పటి వరకు అందించిన లబ్ధిదారులు..
2020-21 సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్య 2,98,122 సాయం రూ. 298.12 కోట్లు
2021-22 సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్య 2,99,225 సాయం రూ. 299.23 కోట్లు
2022-23 సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్య 3,30,145 సాయం రూ. 330.15 కోట్లు
2023-24 సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్య 3,25,020 సాయం రూ. 325.02 కోట్లు
మొత్తం సాయం రూ. 1,252.52 కోట్లు.

Share post:

Popular