Bhatti Vikramarka : ప్రజాభవన్‌లో గృహప్రవేశం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మన ఈనాడు: Bhatti Vikramarka..praja bhavan : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లో గృహప్రవేశం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి శాస్త్రయుక్తంగా గురువారం (డిసెంబర్ 14,2023) తెల్లవారుజామున ప్రజాభవన్‌లో గృహప్రవేశం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రభుత్వం డిప్యూటీ సీఎం భట్టికి ప్రజాభవన్‌ను అధికారిక నివాసంగా బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈరోజు మంచి రోజు కావటంతో భట్టి కుటుంబ సమేతంగా తన నివాసాన్ని ప్రజాభవన్‌లో కొనసాగించేందుకు గృహప్రవేశం చేశారు. వేద పండితుల ఆశ్వీర్వాదాలు అందించారు. డిప్యూటీ సీఎం గృహప్రవేశం సందర్భంగా ప్రజాభవన్‌ను ప్రత్యేకంగా అలంకరించారు.

కాగా..బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రగతిభవన్ సీఎం అధికారిక నివాసంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ భవనాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జ్యోతిరావు పూలే పేరుతో ప్రజాభవన్‌గా మార్చింది. ఆ భవనాన్ని డిప్యూటీ సీఎంకు అధికారిక నివాసంగా కేటాయిస్తు నిన్ననే సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఏమాత్రం ఆలస్యం చేకకుండా మరునాడే భట్టి ప్రజాభవన్‌లో గృహప్రవేశమయ్యారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *