TSPSC: టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ గా ఆ మాజీ ఐఏఎస్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం?

మన ఈనాడు:టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ ఎవరన్న అంశంపై రాష్ట్రంలో జోరుగా చర్చ సాగుతోంది. అయితే.. మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన అంగీకరించకపోతే మరో సీనియర్ ఐఏఎస్ ను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.

తెలంగాణలో ఇటీవల అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సర్కార్ టీఎస్పీఎస్సీ (TSPSC) ప్రక్షాళనపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయగా.. సభ్యులంతా ఒకటి రెండు రోజుల్లో రాజీనామా చేసే అవకాశం ఉంది. దీంతో కొత్త చైర్మన్, సభ్యుల నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. గతంలో పేపర్ లీక్ లు కావడం, పరీక్షలు అనేక సార్లు వాయిదా పడడం, రద్దు కావడం తదితర పరిణామాల నేపథ్యంలో నిరుద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనలు మళ్లీ తలెత్తకుండా.. లోపాలను సరి చేయాల్సి ఉంది. దీంతో ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పని చేసే చైర్మన్ కోసం వెతుకుతోంది రేవంత్ సర్కార్. ఈ రంగంలో అనుభవం కలిగిన వారిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమిస్తే బాగుంటుందన్న చర్చ సాగుతోంది.

Share post:

లేటెస్ట్