Pushpa Movie: ప్రపంచంలో ఎక్కడా లేని సరకు మన దగ్గరే ఉండాది

రష్మిక మందన్నా హీరోయిన్‌గా మెప్పించింది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్‌ విలన్‌గా కనిపించారు. ఈ మూవీకి సీక్వెల్‌గా పుష్ప-2 రూపొందిస్తున్నారు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ విడుదల చేశారు. విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది.

అల్లు అర్జున్ పుష్ప సినిమా ‍క్రేజ్‌ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2021లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఎర్రచందనం సిండికేట్‌ నేపథ్యంలో సుకుమార్‌ తెరకెక్కించిన పుష్ప కలెక్షన్ల వర్షం కురిపించింది.

పుష్ప టీమ్‌ చేసిన ట్వీట్‌ నెట్టింట వైరలవుతోంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను పుష్ప సినిమాతో పోలుస్తూ ఓ ఫోటోను షేర్ చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో హైదరాబాద్‌ టీమ్ తన రికార్డ్‌ను తానే అధిగమించింది. ముంబయిపై 277 పరుగుల అత్యధిక స్కోరు చేసిన ఎస్ఆర్‌హెచ్‌.. మరోసారి బెంగళూరుపై 287 రన్స్‌ చేసి తన రికార్డ్‌ను తానే బద్దలు కొట్టింది. దీంతో మొదటి మ్యాచ్‌ను పుష్ప పార్ట్‌-1గా.. రెండో మ్యాచ్‌ను పుష్ప-2గా పోలుస్తూ పోస్ట్ చేసింది. రెండుసార్లు అత్యధిక స్కోరు చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌కు అభినందనలు తెలిపింది. దీంతో బన్నీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇది చూసిన కొందరు అభిమానులు పుష్ప డైలాగ్స్‌ పోస్ట్ చేస్తున్నారు. ప్రపంచలో ఎక్కడా లేని సరకు మన దగ్గరే ఉండాది అనే డైలాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. ఏ టీమ్ సాధించని రికార్డ్‌ను రెండుసార్లు సన్‌రైజర్స్‌ అధిగమించడం ‍ ఐపీఎల్‌ చరిత్రలో నిలిచిపోనుంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *