Rathnam Review : ‘రత్నం’ మూవీ రివ్యూ.. అమ్మాయి కోసం పోరాటం..

Rathnam Movie Review : యాక్షన్ హీరో విశాల్(Vishal) తాజాగా ‘రత్నం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జీ స్టూడియోస్‌, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో కార్తికేయన్ సంతానం నిర్మాతగా యాక్షన్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రత్నం’ సినిమా నేడు ఏప్రిల్ 26న తెలుగు, తమిళ్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమాగా రత్నం తెరకెక్కింది.

కథ అంతా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ బోర్డర్ లో సాగుతుంది. రత్నం(విశాల్) తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు తమిళనాడులో ఓ ఆపద నుంచి తప్పించుకొని చిత్తూరు వచ్చి ఓ మార్కెట్ లో స్థిరపడుతోంది. రత్నం చిన్నప్పుడే తల్లిని కోల్పోతాడు. రత్నం చిన్నప్పుడే అక్కడ రౌడీగా ఉన్న పన్నీర్(సముద్రఖని)ని కాపాడటానికి వేరే వాళ్ళని చంపి జైలుకు వెళ్తాడు. దీంతో రత్నం పన్నీర్ ని మామయ్య అంటూ అతని దగ్గరే ఉంటాడు. పన్నీర్ ఎమ్మెల్యే అయ్యాక దందాలన్నీ రత్నం చూసుకుంటాడు.

ఈ క్రమంలో ఒకరోజు మల్లిక(ప్రియా భవాని శంకర్) ని రోడ్ మీద చూస్తాడు. తనని చంపడానికి మనుషులు వస్తే వాళ్ళ నుంచి మల్లికని కాపాడతాడు. మల్లిక అచ్చు తన అమ్మలానే ఉండటంతో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాడు. మల్లికకు ఒక ల్యాండ్ సమస్య ఉంది, లింగం(మురళీశర్మ) మనుషులు ఆమెని చంపడానికి తిరుగుతున్నారు అని తెలుసుకొని ఆమెకు రక్షణగా ఉంటాడు. అసలు రత్నం తల్లి ఎవరు? ఆమె కథేంటి? మల్లికకు ఉన్న ల్యాండ్ సమస్య ఏంటి? లింగం మల్లికని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? లింగం – రత్నంలకు ఉన్న సంబంధం ఏంటి? పన్నీర్ రత్నంకి ఎలా అండగా నిలబడ్డాడు అనేవి తెరపై చూడాల్సిందే.
నటీనటుల పర్ఫార్మెన్స్ : విశాల్ ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి పనిచేస్తాడు. యాక్షన్ సీన్స్ కూడా డూప్ లేకుండా చేస్తాడు. రత్నం సినిమాకి కూడా విశాల్ అంతే కష్టపడ్డాడు. ప్రియా భవాని శంకర్ ఆపదలో ఉన్న అమ్మాయిగా తన నటనతో మెప్పించింది. యోగిబాబు అక్కడక్కడా తన కామెడీతో నవ్విస్తాడు. సముద్రఖని ఎమ్మెల్యే పాత్రలో అదరగొట్టాడు. మురళి శర్మ విలన్ గా బాగా నటించారు. చివర్లో గౌతమ్ మీనన్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి మెప్పించారు. మిగిలిన నటీనటులు అంతా పాత్రకు తగ్గట్టు నటించి పర్వాలేదనిపించారు.

 

Related Posts

Naga Chaitanya: స్టైలిష్ లుక్‌లో చైతూ.. ‘NC24’ షూటింగ్ షురూ

‘తండేల్’ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు హీరో అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya), డైరెక్టర్ చందూ మొండేటి(Chandu Mondeti) తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్(Box Office) వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *