JaggaReddy:ఘర్ వాపసీ మొదలు పెట్టాం.. ఎవరు వచ్చినా చేర్చుకుంటాం: జగ్గారెడ్డి

సంభాని చంద్రశేఖర్ లాంటి వాళ్లు కూడా వెనక్కి వచ్చారు. ఎవరు వచ్చినా చేర్చుకుంటాం. మనకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళను కూడా చేర్చుకోవాలని హైకమాండ్ సూచించింది.

”ఏఐసీసీ నిర్ణయాల మేరకే నడుచుకుందాం. మనకు పదవులు సోనియాగాంధీ.. రాహుల్ కష్టమే. రాజీవ్ గాంధీని చంపిన వ్యక్తులను క్షమించిన గుణం సోనియాగాంధీ, రాహుల్.. ప్రియాంకది. మనం వాళ్ళ నీడలో రాజకీయంగా బతుకుతున్నాం. నా దగ్గర కూడా వ్యతిరేకంగా ఐదారుగురు పని చేశారు. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మళ్ళీ వస్తానంటే రమ్మని చెప్పినా. అమిత్ షా మైనార్టీ రిజర్వేషన్లు తీసేస్త అంటున్నారు. మైనార్టీలు జాగ్రత్తగా ఉండండి బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తోంద”ని జగ్గారెడ్డి అన్నారు.

Jagga Reddy: కాంగ్రెస్ పార్టీలో ఘర్ వాపసీ మొదలు పెట్టామని, చాలా మంది నాయకులు వెనక్కి వస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. శుక్రవారం మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంభాని చంద్రశేఖర్ లాంటి వాళ్లు కూడా వెనక్కి వచ్చారని, ఎవరు వచ్చినా చేర్చుకుంటామన్నారు. మనకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళను కూడా చేర్చుకోవాలని హైకమాండ్ సూచించిందని వెల్లడించారు. సంగారెడ్డిలో నాకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళు వచ్చి చేరతానన్నా, చేర్చుకుంటామన్నారు.

Related Posts

Bhairavam OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘భైరవం’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

తెలుగు సినీ ప్రియులకు శుభవార్త. బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), మంచు మనోజ్(Manchu Manoj), నారా రోహిత్(Nara Rohith) ప్రధాన పాత్రల్లో నటించిన హై-ఓక్టేన్ యాక్షన్ డ్రామా ‘భైరవం(Bhairavam)’ ఓటీటీలోకి రాబోతోంది. ఈ చిత్రం జులై 18 నుంచి ZEE5…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *