Mana Enadu:క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు హైదరాబాద్ మెట్రో అధికారులు. ఈరోజు ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ – రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో మెట్రో రైళ్ల సేవలను అర్థరాత్రి 1:10 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Hyderabad Metro Services: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు హైదరాబాద్ మెట్రో అధికారులు. ఈరోజు ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ – రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. కాగా క్రికెట్ అభిమానులకు ప్రయాణం ఈజీగా చేసేందుకు మెట్రో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. అభిమానులు మ్యాచ్ మిస్ కాకుండా ఉండేందుకు, వారికి ట్రాఫిక్ సమస్య నుంచి చెక్ పెట్టేందుకు తమ సేవలను పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈరోజు అర్థరాత్రి 1:10 వరకు మెట్రో సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని చెప్పింది. కేవలం ఈరోజు వరకే ఈ సేవలు ఉంటాయని తెలిపింది. కాగా అందరు ఈ సేవలను ఉపయోగించుకోవాలని కోరింది.
ఉప్పల్ మార్గంలో వెళ్లే మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగించారు అధికారులు. నాగోల్, ఉప్పల్ స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ స్టేషన్ల నుంచి చివరి రైళ్లు అర్ద రాత్రి 12:15 బయలు దేరి 1:10 వరకు చివరి టర్మినల్స్ కు చేరుకుంటుందని మెట్రో అధికారులు పేర్కొన్నారు. సాధారణంగా ఐపీఎల్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగినా హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నారు.