Itlu Mee Cinima| రీల్​ లైఫ్​ రియల్​ స్టోరీ.. “ఇట్లు… మీ సినిమా”..

Mana Enadu: లిటిల్ బేబీస్ క్రియేషన్స్ పతాకంపై నోరి నాగ ప్రసాద్ నిర్మాతగా, దర్శకుడు హరీష్ చావా రూపొందిస్తున్న చిత్రం “ఇట్లు… మీ సినిమా”. అభిరామ్, వెన్నెల, మనోహర్, పవన్, కృష్ణ, మంజుల హీరో హీరోయిన్లుగా, ప్రదీప్, అమ్మ రమేష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

నలుగురు యువకులు తమకున్న ప్యాషన్ తో, సినిమా రంగానికి వచ్చి వాళ్లు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి, వాళ్ళు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారా లేదా అనే కథాంశంతో లవ్, రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్ కలగలిసి ఈ చిత్రాన్ని రూపొందించారు. “ఇట్లు… మీ సినిమా” ఈనెల 21న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా విడుదల చేశారు.
దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ – “ఇట్లు… మీ సినిమా” దర్శకుడు హరీష్ చావా ప్రతిభావంతుడు. సినిమాను బాగా రూపొందించాడు. చిన్న సినిమాకు సపోర్ట్ చేసేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు.

దర్శకుడు హరీష్ చావా మాట్లాడుతూ – “ఇట్లు… మీ సినిమా” రూపొందించే క్రమంలో ప్రొడ్యూసర్ నోరి నాగప్రసాద్ మొదటి నుంచి సపోర్ట్​గా నిలిచారు.ఏ కథో ఎందుకు మన కథే తీద్దాం అన్నారు. మనం సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేందుకు పడిన ఇబ్బందులతోనే సినిమా చేద్దామన్నారు.
నిర్మాత నోరి నాగ ప్రసాద్ మాట్లాడుతూ – మా “ఇట్లు… మీ సినిమా” మూవీ ట్రైలర్ లాంఛ్ కు అతిథులుగా వచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు.
నటీనటులు – అభిరామ్, వెన్నెల, మనోహర్, పవన్, కృష్ణ, మంజుల, ప్రదీప్, అమ్మ రమేష్ తదితరులు

టెక్నికల్ టీమ్ – డాన్స్: తాజ్, పి ఆర్ ఓ: చందు రమేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బూస్సా బాలరాజు, నిర్మాత: నోరి నాగ ప్రసాద్, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హరీష్ చావా.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *