35 Chinna Katha Kaadu Teaser :కొడుకును పాస్ చేసేందుకు నివేదా క‌ష్టాలు..!

Mana Enadu: మ‌ల‌యాళ ముద్దు గుమ్మ నివేదా థామ‌స్ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వ‌స్తోంది. కొంత గ్యాప్ త‌రువాత ఆమె న‌టిస్తున్న మూవీ ’35 – చిన్న క‌థ కాదు’. నందకిషోర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ప్రియ‌ద‌ర్శి, విశ్వ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా రానా ద‌గ్గుబాటి నిర్మిస్తున్నారు. టైటిల్‌తోనే అంద‌రిని ఆక‌ట్టుకున్న ఈ మూవీ, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌నూ మెప్పించింది. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

వివేక్ సాగ‌ర్ అందించిన బీజీఎం చాలా బాగుంది. తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఆగ‌స్టు 15న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇందులో నివేదా థామ‌స్ ఓ మ‌ధ్య త‌ర‌గతి గృహిణి పాత్ర‌లో క‌నిపిస్తోంది. కొడుకు చ‌దువులో వెనుబ‌డ‌డంతో త‌న‌లాగా ఫెయిల్ కాకూడ‌ని, పాస్ మార్కులు తెచ్చుకోవాల‌ని టీచ‌ర్లు చెప్ప‌డంతో ఆ త‌ల్లి ఏం చేసింద‌నే క‌థాంశంతో ఈ మూవీ తెర‌కెక్కిన‌ట్లుగా టీజర్‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. నివేదా థామ‌స్ యాక్టింగ్ అదిరిపోయింది.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *