Pawan Kalyan|సినిమాలు చేయడం పై క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Mana Enadu: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. కూటమి ప్రభుత్వం లో జనసేనాని పవన్ కల్యాణ్ కీలక మంత్రిత్వ శాఖలతో పాటు డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యాడు.

అనంతరం మంత్రివర్గంతో కలిసి అభివృద్ధి మౌలిక సదుపాయాలు, విజయోత్సవ రాలి పై ప్రస్తుతం పవన్ దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా బుధవారం పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ ప్రాంతంలో భారీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతుండగా.. ఆయన అభిమానులు OG, OG అంటూ అరవడం మొదలు పెట్టారు.

దీంతో పవన్ నవ్వూతూ స్పందిస్తూ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు మెరుగైన పాలనపై దృష్టి కేటాయించామని.. ఈ సమయంలో మనం ప్రజలకు చేయాల్సిన పనులు వదిలేసి సినిమా షూటింగ్ లో పాల్గొంటే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయని అన్నారు. తనను నమ్మి ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రజలకు సేవ చేసుకుంటూ కుదిరినప్పుడల్లా నెలలో రెండు, మూడు రోజులు సినిమా షూటింగ్‌లో పాల్గొంటానని తెలిపారు. ఇదే విషయంపై తాను ఒప్పుకున్న సినిమాలకు సంబంధించిన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లకు తన షేడ్యూల్ తయారు చేసుకొవాలని చెప్పినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అలాగే త్వరలో షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కాబోతున్న OG సినిమాను అందరూ చూడాలని, ఆ సినిమా చాలా బాగుంటుందని ఉప్పాడ సభలో తన అభిమానులకు పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

 

Related Posts

‘The Girlfriend’: రష్మిక మందన్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఫస్ట్ సాంగ్ రిలీజ్.. కాపీ చేశారంటూ మొదలైన రచ్చ

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మికా మందన్న(Rashmika Mandanna) వరుస విజయాలతో ఇండస్ట్రీలో దూసుకెళ్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఇలా అన్ని ఇండస్ట్రీలలో కూడా బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్టులకు ఓకే చెబుతోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘ది…

Side Income: సైడ్ ఇన్‌కమ్ కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే బెస్ట్ ఆప్షన్స్ ఇవే!

నేటి పోటీ ప్రపంచంలో ఆర్థిక భద్రత కోసం ఎక్కువ మంది ఉద్యోగం(Job) కాకుండా మరో ఆదాయన్నీ వెతుకుతున్నారు. ఖాళీ సమయాన్ని ఉపయోగించుకొని హాబీలను, నైపుణ్యాలను ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు. ఇందు కోసం అనేక మంది సైడ్ ఇన్‌కమ్( Side Income )…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *