Mana Enadu:బిగ్‌బాస్.. ఈ రియాల్టీ షో గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. వరుసగా ఏడు సీజన్లు సూపర్ హిట్ గా నిలిచి ప్రతి ఇంటికి వెళ్లిన ఈ షో ఇప్పుడు సరికొత్తగా ఎనిమిదో సీజన్ తో త్వరలో ముందుకు రాబోతోంది. అయితే గత సీజన్ లాగే ఈ సీజన్ కు కూడా హోస్టు నాగార్జునే. ఈ నేపథ్యంలో ఇప్పటికే బిగ్ బాస్ సీజన్-8లోకి వెళ్లే కంటెస్టులు వీళ్లేనంటూ నెట్టింట్లో తెగ ప్రచారం జరుగుతోంది. ఈసారి సూపర్ యాక్టివ్ కంటెస్టులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం మాత్రం లేదు.
అయితే తాజాగా బిగ్ బాస్ టీమ్ ఓ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చింది. బిగ్‌బాస్ సీజన్ 8కు సంబంధించిన టీజర్ విడుదల చేసింది. గత కొన్ని సీజన్ల నుంచి హోస్టుగా వ్యవహరిస్తోన్న నటుడు నాగార్జున ఈసారి కూడా హోస్ట్‌గా కనిపించనున్నాడు. కమెడియన్ సత్య పాత్రతో ఈ టీజర్ వీడియో ఓపెన్ అయింది. ఈ వీడియోలో నాగార్జున జీనీలా కనిపించాడు. ‘వరాలు ఇచ్చే కింగ్.. ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు’ అంటూ నాగార్జున డైలాగ్ లో ఏదో ఆంతర్యం ఉందనిపించేలా కనిపిస్తోంది. ‘ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం సిద్ధంకండి’ అంటూ ఈ సీజన్ సరికొత్తగా అలరించనుంది. మరి సీజన్-8 ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? ఇందులో పాల్గొనే కంటెస్టెంట్‌లు ఎవరు? తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే!

అయితే ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ కు వస్తుంది వీళ్లేనంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో కొన్ని పేర్లు వైరల్ అవుతున్నాయి. ఆ లిస్టులో ఓ పేరు మాత్రం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆయనే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి. టీవీలో, యూట్యూబ్ ఛానల్‌లో జ్యోతిష్యం చెబుతూ ఫేమస్ సెలబ్రిటీలకు జాతకం చెప్పడం, వారితో ప్రత్యేక పూజలు కూడా చేయిస్తూ బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన బిగ్ బాస్ హౌసులోకి వస్తే ఫన్ మామూలుగా ఉండదంటున్నారు నెటిజన్లు.
ఇక వేణుస్వామితో పాటు బర్రెలక్క, కిర్రాక్ ఆర్పీ, కుమారి ఆంటీ, యూట్యూబర్ నిఖిల్ విజయేంద్రసింహా, కుషిత కళ్లపు, సోనియా సింగ్, రీతూ చౌదరి వస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు పాత కంటెస్టెంట్స్ అయినా నైనీ పావని, యాంకర్ శివ, స్రవంతి చొక్కారపు హౌజ్‌లోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్. ఏదేమైనా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఈ సస్పెన్స్ తప్పదు మరి.






