Mana Enadu:యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న మూవీ ‘దేవర’. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో దేవర ఒకటి. RRR తర్వాత యంగ్ టైగర్ నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఆచార్య డిజాస్టర్ తర్వాత ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసితో డైరెక్టర్ కొరటాల శివ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
లేటెస్ట్ అప్‌డేట్..
ఇక దేవర మూవీ నుంచి ఇప్పటికే ఓ మాస్ గ్లింప్స్, మాస్ సాంగ్ రిలీజ్ చేయగా ఆగస్టు 5న ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మీద తెరకెక్కించిన ఓ రొమాంటిక్ మెలోడీ సాంగ్ ని విడుదల చేస్తామని ప్రకటించారు. తాజాగా ఈ సాంగ్ మ్యూజిక్ ప్రోమోని సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఎన్టీఆర్, జాన్వీ ఉన్న ఓ కొత్త పోస్టర్ కి ఈ మ్యూజిక్ జత చేసి షేర్ చేసింది. ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాయగా అనిరుద్ సంగీతం అందించాడు. దీంతో ఫ్యాన్స్ ఈ రొమాంటిక్ సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు.
పాన్ ఇండియా రేంజ్‌లో..
పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుండగా.. ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాతోనే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. మొదటిసారి ఎన్టీఆర్, జాన్వీ జోడీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే ఇందులో బీటౌన్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
https://x.com/DevaraMovie/status/1819698373760549341






