కళ్లజోడు కన్నడ బ్యూటీ.. మూవీలో ఛాన్స్ కొట్టేసింది!

 

Mana Enadu: నటీమణులు.. ఒక ఇండస్ట్రీలోనే కాకుండా.. రెండు పడవలపైనా ప్రయాణం చేస్తూ.. చేతి నిండా సినిమాలతో తెగ బిజీ అయిపోతున్నారు. పైన పేర్కొన్న ఫోటోలోని అమ్మాయిని చూశారా.? ఆమె ఒక స్టార్ హీరోయిన్. ఒక్క ఇండస్ట్రీ కాదు.. ఏకంగా మూడు ఇండస్ట్రీలలో చక్రం తిప్పుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతికొద్దికాలంలోనే యంగ్ హీరోలతోనే కాదు.. స్టార్ హీరోల సరసన కూడా నటించే ఛాన్స్ దక్కించుకుంది. మరి ఆమెవరో గుర్తుపట్టారా.?

 కర్ణాటకలో పుట్టినా..

ఆమె మరెవరో కాదు అషికా రంగనాధ్. కర్ణాటకలోని తుమకూరులో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. బుల్లితెర నుంచి తన కెరీర్ నుంచి ప్రారంభించింది. పలు డ్యాన్స్ షోలలో పాల్గొని.. 2014లో మిస్ ప్రెష్ ఫేస్ పోటీల్లో రన్నరప్‌‌గా నిలిచింది. క్రేజీ బాయ్ మూవీలో అద్భుతమైన నటనతో తనదైప ముద్రవేసి ప్రేక్షకులను మెప్పించింది అషికా రంగనాథ్. ఆ తర్వాత కామెడీ థ్రిల్లర్ చిత్రం అవతార పురుష పార్ట్-2లోనూ సందడి చేసిందీ బ్యూటీ. కన్నడలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. కళ్యాణ్ రామ్ హీరోగా 2023లో వచ్చిన అమిగోస్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

 కుర్రకారు మతిపోగొడుతోంది

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేస్తోంది ఈ ముద్దుగుమ్మ. నాగార్జున సరసన నా సామిరంగ చిత్రంలో వరలక్ష్మీ పాత్రతో తెలుగువారి మన్ననలను పొందింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరలో ఓ కీలక రోల్‌లో నటించే ఛాన్స్ కొట్టేసింది. అంతేకాదండోయ్.. గ్యాప్ దొరికితే చాలు ఫొటోషూట్లతో కుర్రకారు మతిపోగొడుతోందీ బ్యూటీ. తాజా ఓ బోల్డ్ ఫొటో షూట్‌తో యూత్‌లో గుబులు రేపుతోంది. మొత్తంగా తెలుగు, కన్నడ, తమిళ భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది అషికా రంగనాథ్.

https://x.com/AshikaRanganath/status/1781917016795861239

Share post:

లేటెస్ట్