‘డబుల్ ఇస్మార్ట్​’తో పూరీ.. ‘మిస్టర్ బచ్చన్​’తో హరీశ్ శంకర్.. గురుశిష్యుల్లో గెలుపెవరిది?

Mana Enadu:పూరీ జగన్నాథ్.. ఈ పేరుకే టాలీవుడ్​లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాలు.. ముఖ్యంగా ఆయన హీరోలు.. వాళ్ల యాటిట్యూడ్​కు మామూలు క్రేజ్ ఉండదు. డైరెక్షన్​లో ఆయన రూటే సపరేటు. లోకల్ చంటిగాడు.. మైండ్ బ్లాక్ చేసే పండుగాడు ఈయన హీరోలే. ఒక్కో సినిమా ఒక్కో డైమండ్. ఈ మధ్య ఈయన సినిమాలు అంతగా ఆడకపోయినా.. పూరీ నుంచి సినిమా వస్తుందంటే మినిమమ్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని తప్పకుండా ప్రేక్షకులు థియేటర్​కు వెళ్తారు.

హరీశ్ శంకర్.. టాలీవుడ్​లో మాస్ డైరెక్టర్లలో ఈయన ఒకరు. డైరెక్షన్​లో ఈయన కూడా కాస్త సపరేటు రూట్​లోనే వెళ్తారు. కమర్షియల్ చిత్రాలకు ఈయన కేరాఫ్ అడ్రస్. హరీశ్ శంకర్ పూరీ జగన్నాథ్​ను తన గురువుగా భావిస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ గురుశిష్యులు తమ కొత్త సినిమాలతో పోటీ పడుతున్నారు. మరి ఈ పోటీలో గెలుపెవరిది?

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. హరీశ్ శంకర్ డైరెక్షన్​లో మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న మూవీ మిస్టర్ బచ్చన్. ఈ రెండు సినిమాలు ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కాబోతున్నాయి. లైగర్ ప్లాఫ్​తో ఉన్న పూరీకి డబుల్ ఇస్మార్ట్ బెన్​ఫిట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ కాబట్టి డబుల్ ఇస్మార్ట్ కూడా అదే రేంజ్ హైప్​తో ఉండటంతో పూరీ ఖాతాలో హిట్ ఖాయమని టాక్.

మరోవైపు హరీశ్ శంకర్ కూడా మంచి ఫామ్​లో ఉన్నాడు. ఇక మిస్టర్ బచ్చన్​పైనా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ కాబోతుండటంతో ప్రేక్షకులు ఎవరిని గెలిపిస్తారనేదానిపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. పూరీ జగన్నాథ్, హరీశ్ శంకర్ ఇద్దరూ కమర్షియల్ డైరెక్టర్లే. ఇద్దరు సినిమాల్లో హీరోలు మాస్ ప్రేక్షకులకు ఫేవరెట్. ఇక హీరో క్యారెక్టరైజేషన్ దాదాపుగా ఇద్దరి సినిమాల్లో ఒకేలా ఉంటుంది. ఇక ఈ ఇరువురి మూవీస్​లో డైలాగ్స్​కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ క్రమంలో డబుల్ ఇస్మార్ట్ అంటూ వస్తున్న రామ్.. మిస్టర్ బచ్చన్ అంటూ వస్తున్న రవితేజ.. ఎవరు తమ డైరెక్టర్​ను గెలిపిస్తారో చూడాలంటే మరో వారం ఆగాలసిందే.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *