మరో పవర్​ఫుల్ కాంబో ఆన్ ది వే.. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ మూవీ ప్రారంభం.. ఇక పూనకాలే

Mana Enadu:కేజీయఫ్, సలార్ సినిమాలతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఆయన సలార్-2 సినిమా వర్క్​లో బిజీగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజనుకుపైగా సినిమాలుండటంతో సలార్-2 నుంచి కాస్త బ్రేక్ తీసుకుని ప్రశాంత్ నీల్ తన నెక్ట్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు. కొంతకాలంగా ఈ కాంబోలో సినిమా వస్తోందని నెట్టింట ప్రచారం జరుగుతోంది.

ఎట్టకేలకు ఇది అఫీషియల్ అయింది. ప్రశాంత్‌ నీల్‌, ఎన్టీఆర్‌ల సినిమా ఇవాళ షురూ అయింది. పూజా కార్యక్రమాలతో దీన్ని ఈరోజు ప్రారంభించారు. రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్​కు ఎన్టీఆర్‌, ప్రశాంత్ నీల్ ఫ్యామిలీ అటెండ్ అయింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కాంబో అఫీషియల్ అయిన నేపథ్యంలో ‘#NTRNeel’ హ్యష్‌ట్యాగ్​ను ట్రెండ్ చేస్తున్నారు.

ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పెట్టినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. కానీ మేకర్స్ టైటిల్​పై క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ చిత్రం 2026 జనవరి 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు మాత్రం ప్రకటించారు. అయితే ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోలు ఏ రేంజ్ మాస్​లో ఉంటారో తెలిసిందే. ఇక ఎలివేషన్ ఏ రేంజ్​లో ఉంటుందో తెలిసిందే. అలాంటింది మ్యాన్ ఆఫ్ మాసెస్​తో సినిమా అంటే ఇంకా ఎలివేషన్లు ఊహకు అందవంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా తన ముందు చిత్రాల్లో ఉండదని.. డిఫరెంట్ జానర్​లో ఎమోషనల్ అంశాలతో కూడుకుని ఉంటుందని ప్రశాంత్ నీల్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఏమో.. ఈ ఇద్దరి కాంబో ఎలా ఉంటుందో చూడాలంటే.. వచ్చే ఏడాది వరకు వేచి చూడాల్సిందే.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *