Mana Enadu:కేజీయఫ్, సలార్ సినిమాలతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఆయన సలార్-2 సినిమా వర్క్‌లో బిజీగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజనుకుపైగా సినిమాలుండటంతో సలార్-2 నుంచి కాస్త బ్రేక్ తీసుకుని ప్రశాంత్ నీల్ తన నెక్ట్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు. కొంతకాలంగా ఈ కాంబోలో సినిమా వస్తోందని నెట్టింట ప్రచారం జరుగుతోంది.
ఎట్టకేలకు ఇది అఫీషియల్ అయింది. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్‌ల సినిమా ఇవాళ షురూ అయింది. పూజా కార్యక్రమాలతో దీన్ని ఈరోజు ప్రారంభించారు. రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఫ్యామిలీ అటెండ్ అయింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కాంబో అఫీషియల్ అయిన నేపథ్యంలో ‘#NTRNeel’ హ్యష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పెట్టినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. కానీ మేకర్స్ టైటిల్‌పై క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ చిత్రం 2026 జనవరి 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు మాత్రం ప్రకటించారు. అయితే ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోలు ఏ రేంజ్ మాస్లో ఉంటారో తెలిసిందే. ఇక ఎలివేషన్ ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే. అలాంటింది మ్యాన్ ఆఫ్ మాసెస్‌తో సినిమా అంటే ఇంకా ఎలివేషన్లు ఊహకు అందవంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా తన ముందు చిత్రాల్లో ఉండదని.. డిఫరెంట్ జానర్లో ఎమోషనల్ అంశాలతో కూడుకుని ఉంటుందని ప్రశాంత్ నీల్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఏమో.. ఈ ఇద్దరి కాంబో ఎలా ఉంటుందో చూడాలంటే.. వచ్చే ఏడాది వరకు వేచి చూడాల్సిందే.






