Mana Enadu: నేచురల్ స్టార్ నాని హీరోగా, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో రూపొందిన చిత్రం ‘‘సరిపోదా శనివారం’’. ఈ మూవీ ఆగస్టు 29న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ‘అంటే సుందరానికి’ మూవీ తర్వాత వీరి కాంబినేషన్లో వస్తోన్న మూవీ కావడంతో దీనిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి హీరో నాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆగస్టు 24న నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించారు.
ఈమేరకు హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్, నొవోటల్లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఓ సరికొత్త పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీకి జేక్స్ బెజోయ్ మ్యూజిక్ సమకూర్చాడు. ఈ సినిమాలో తమిళ నటుడు, సీనియర్ యాక్టర్ ఎస్జే సూర్య విలన్ రోల్ పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.
నాని కోపానికి కారణం ఎవరు?
మరోవైపు నాని ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆయన ఇటీవల ఎక్కువగా మాస్ మూవీస్‌కే అధిక ప్రాధన్యత ఇస్తున్నాడు. దీంతో సరిపోదా శనివారం కూడా భారీ యాక్షన్ సినిమాలానే కనిపిస్తోంది. మూవీలో నాని క్యారెక్టరైజేషన్ సాఫ్ట్‌గా కనిపిస్తూనే శనివారం రోజు అగ్రెసివ్‌గా మారిపోతుంది. మరి అతని కోపానికి కారణం ఎవరు అనేది ఆల్రెడీ ట్రైలర్లో చూపించాడు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. మరి దానికి రీజన్ ఏంటి, ఎందుకు నాని అలా ఛేంజ్ అవుతాడు.. సూర్య విలనిజం ఏంటన్నది మాత్రం తెలియాలంటే ఈనెల 29 వరకూ ఆగాల్సిందే. అయితే శనివారం నిర్వహించనున్న ఈ ‘‘సరిపోదా శనివారం’’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.
తిరుమల వేంకటేశుడిని దర్శించుకున్న నాని
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నేచురల్ స్టార్ నాని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈనెల 29న ‘సరిపోదా శనివారం’ మూవీ విడుదల నేపథ్యంలో హీరోయిన్ ప్రియాంకా అరుళ్ మోహన్, సతీమణి అంజనా, కుమారుడు అర్జున్‌తో కలిసి వీఐపీ విరామ సమయంలో స్వామి వారి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.