ManaEnadu:బిగ్‌బాస్ ఫేమ్ గౌతమ్‌కృష్ణ హీరోగా నవీన్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సోలో బాయ్’. సతీశ్ కుమార్ నిర్మిస్తున్నారు. శనివారం ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌గా టైటిల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు నవీన్‌కుమార్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. మంచి సబ్టెక్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో చాలా ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి’’ అని చెప్పారు.
హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ : హుక్ స్టెప్ చాలెంజ్ చేసి మమ్మల్ని, టీం ని ట్యాగ్ చేసి పోస్ట్ చేసిన వాళ్ళ నుంచి బెస్ట్ సెలెక్ట్ చేసి మీడియా ముందే బహుమతిని ఇస్తాము. నాలో ఉన్న డాన్సర్ని బయటికి తీసుకొచ్చింది సందీప్ మాస్టర్. నీలో మంచి రిథమ్ ఉంది కొంచెం కష్టపడితే కచ్చితంగా మంచి డాన్సర్ అవుతావు అని చెప్పారు. టైటిల్ సాంగ్ కాసర్ల శ్యామ్ గారు రాశారు రాహుల్ సిప్లిగంజ్ అన్న పాట అద్భుతంగా పాడాడు. ఇద్దరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి హిట్టయి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ముందు ముందు టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మీ ముందుకు వస్తాము. అదేవిధంగా నెగటివ్ ట్రోల్స్ చేసే అందరికీ ఒక ఫ్రెండ్ లా చెప్తున్నా మీ కెరీర్ మీద కాన్సెంట్రేట్ చేయండి. నెగిటివ్ కామెంట్స్ నెగటివ్ ట్రోల్స్ ఆపుకోండి.
నటీనటులు – గౌతమ్ కృష్ణ, శ్వేతా అవస్థి, రమ్య పసుపులేటి, పోసాని కృష్ణ మురళి, అనితా చౌదరి, షఫీ, ఆర్కే మామ, భద్రమ్, ఆనంద్ చక్రపాణి, సూర్య, ల్యాబ్ శరత్, అరుణ్ కుమార్, రజినీ వర్మ నటించారు.