Seetharam Sitralu:ప్రశాంతత కల్పించే సినిమా..సీతారాం సిత్రాలు..ట్రైలర్​ రిలీజ్​

ManaEnadu:లక్ష్మణ మూర్తి రతన, భ్రమరాంబిక తూటిక ప్రధాన పాత్రల్లో రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ పి. పార్థసారథి, డి. నాగేంద్ర రెడ్డి, కృష్ణ చంద్ర విజయబట్టు నిర్మాతలుగా డి. నాగ శశిధర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా సీతారాం సిత్రాలు. ఈ సినిమా గ్రాండ్ ట్రైలర్ లాంచ్ నేడు ఆకాష్ జగన్నాథ్ చేతుల మీదుగా జరిగింది. ఈ సినిమా ఈనెల 30న విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా హీరో ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ : తెలుగు ప్రేక్షకులు సినిమా నచ్చితే తమ భుజాల పైన వేసుకుని ముందుకు తీసుకెళ్తారని పేర్కొన్నారు. ప్రతి ఇండస్ట్రీ కూడా మన తెలుగు ప్రేక్షకుల వైపే చూస్తుంది. సినిమా బాగుంటే పెద్ద విజయాన్ని అందిస్తారు. ఈ సినిమా కూడా అందరూ చూసి ఆదరించి పెద్ద విజయాన్ని అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ : సీతారాం సిత్రాలు లో పనిచేసిన ప్రతి ఒక్కరు ఇది తమ సొంత సినిమా లాగా కష్టపడి పని చేశారు. ఈ సినిమా డిజిటల్ గా ట్రైలర్ లాంచ్ చేసిన డైరెక్టర్ మారుతి గారికి, రెండు పాటల్ని విడుదల చేసిన హీరో విశ్వక్సేన్ గారికి, హీరో సందీప్ కిషన్ కి కృతజ్ఞతలు తెలిపారు.
డైరెక్టర్ డి.నాగ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ సినిమా 2019 కోవిడ్ వచ్చిన తర్వాత మెంటల్ స్ట్రెస్ కి జనాలు ఎక్కువ గురవుతున్నారు. ఆ కోవిడ్ టైంలో ఎక్కువ స్ట్రెస్ రిలీఫ్ ఇచ్చింది సినిమాలే. నేను ఎక్కువ చూసింది జంధ్యాల, ఈవివి సత్యనారాయణ, రేలంగి సినిమాలు ఎక్కువ చూశానని వివరించారు.
హీరో లక్ష్మణ మూర్తి రతన మాట్లాడుతూ : గుడికి వెళితే ప్రశాంతంగా ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే అంతే ప్రశాంతంగా ఉంటుంది. ఈ సినిమా మొత్తం కొత్త వాళ్ళం కలిసి చేశామన్నారు.
లక్ష్మణ మూర్తి రతన, భ్రమరాంబిక తూటిక, కిషోరి ధాత్రక్, ఆకెళ్ళ రాఘవేంద్ర, సందీప్ వారణాసి, ఢిల్లీ రాజేశ్వరి, కృష్ణమూర్తి వంజారిలు నటించారు.

Share post:

లేటెస్ట్