Mohan Lal: ఏడాదిలో 25 హిట్లు కొట్టిన ఏకైక హీరో.. ఆయన నెట్ వర్త్ ఏంతో తెలుసా?

ManaEnadu:ఆరు పదుల వయసు.. అయినా భారత చలన చిత్ర రంగంలో ఆయన క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. యంగ్ హీరోలకు దీటుగా.. చెప్పాలంటే వాళ్లను మించిన స్క్రిప్టులు ఎంచుకుంటూ నటనలో తనదైన శైలితో ఆకట్టుకున్నారు మలయళ స్టార్ హీరో.. లాలెట్టగా ప్రజలు ముద్దుగా పిలుచుకునే మోహన్ లాల్. ఐదు జాతీయ అవార్డులు.. తొమ్మిది రాష్ట్ర అవార్డులు.. పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ఆయణ్ని సత్కరించాయి. 64 ఏళ్ల వయసులోనూ 25 ఏళ్ల కుర్రాడిలోలని ఉత్సాహంతో ఎంతో అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తారు మోహన్ లాల్. ఆయన గురించి కొన్ని ప్రత్యేక విషయాలు తెలుసుకుందామా?

ఒకే ఏడాదిలో 25 హిట్ మూవీస్..

1980లో విడుదలైన ‘మంజిల్ విరింజ పూక్కల్’ సినిమా మోహన్​లాల్​కు పెద్ద బ్రేక్ వచ్చింది. 1982, 1986 మధ్యకాలంలో ఆయన సినిమాలు ప్రతి 15 రోజులకు ఒకటి విడుదలయ్యేదంటే ఆయన క్రేజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అలా ఒక్క ఏడాదిలోనే మోహన్​లాల్ ఏకంగా 34 సినిమాల్లో నటించి రికార్డు సృష్టించారు. అంతే కాదు.. ఒకే ఏడాదిలో 25 వరుస హిట్ మూవీలు అందించిన రికార్డులు తిరగరాశారు. ఈ రికార్డు ఇప్పటికీ భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఎవరూ బద్ధలు కొట్టలేకపోయారు. మలయాళం ఇండస్ట్రీ తన పుట్టినల్లు అయినా .. 2002లో రామ్ గోపాల్ వర్మ సినిమా ‘కంపెనీ’తో బాలీవుడ్‌లో, డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్​లోకి అడుగుపెట్టారు. ఇక తెలుగులో జనతాగ్యారేజ్​లో ఆయన పోషించిన పాత్రను తెలుగు ప్రేక్షకులు ఎన్నటికీ మరవలేరు.

నటనలోనే కాదు..

మోహన్ లాల్ కేవలం నటుడు మాత్రమే కాదు. ఆయన చేతికి మైక్ వచ్చిందంటే సింగర్ అయిపోతారు. మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారారు. ఇక తనకు నచ్చిన స్క్రిప్టు దొరికితే నిర్మాత అవతారం ఎత్తుతారు. ఏదైనా సినిమా బాగా నచ్చితే దాన్ని డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తారు. ఇక తెరపై తన నటనతో మ్యాజిక్ చేయడమే కాకుండా.. జిమ్మిక్కులు చేస్తూ కూడా తన మ్యాజిక్​తో అందరినీ ఆకట్టుకుంటారు. ఇందు కోసం ఆయన 2008లో మేజిక్​ను నేర్చుకున్నారు. ఇక టైక్వాండోలో బ్లాక్ బెల్ట్ హోల్డర్ మన మోహన్ లాల్.

నెట్ వర్త్ ఎంతంటే..?

మోహన్​లాల్​కు ఊటీలో ఇల్లు, దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్, అక్కడే ‘మోహన్‌లాల్ టేస్ట్‌బడ్స్’ పేరుతో రెస్టారెంట్స్‌ ఉన్నాయి. మాక్స్‌లాబ్ సినిమా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, త్రివేండ్రంలో ‘విస్మయ మాక్స్’ పేరుతో ఫిల్మ్ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో, రెస్టారెంట్స్, మసాలా ప్యాకేజింగ్ బిజినెస్​లూ ఈయన సొంతం. లగ్జరీ కార్ల కలెక్షన్‌లో మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్, రేంజ్ రోవర్ ఉన్నాయి. ఇక ట్రేడ్ వర్గాల నివేదికల ప్రకారం, ఆయన నెట్‌ వర్త్‌ రూ.376 కోట్లు ఉన్నట్లు సమాచారం.

Share post:

లేటెస్ట్