Joe Root: ఇంగ్లండ్ ప్లేయర్ శతకాల మోత.. టెస్టుల్లో రూట్ రిక్డారు

 

Joe Root embraces his Dad after walking off at Lord’s as England’s top century-maker

Mana Enadu: ఇంగ్లండ్(England) సీనియర్ స్టార్ బ్యాటర్ జో రూట్(Joe Root) టెస్టుల్లో దుమ్ములేపుతున్నాడు. శ్రీలంక(Srilanka)తో జరుగుతున్న టెస్టు సిరీస్‌(Test Series)లో శతకాల(Centuries) మోత మోగిస్తున్నాడు. లాడ్స్‌(Lord’s)లో జరుగుతున్న రెండో టెస్టులో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఈ వెటరన్ ప్లేయర్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ మూడంకెల స్కోరు సాధించాడు. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన చరిత్ర సృష్టించారు. దీంతో తన టెస్ట్ కెరీర్లో 34వ శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్‌(Alister Cock 33 సెంచరీలు) రికార్డును బ్రేక్ చేశారు. అత్యధిక టెస్టు శతకాలు చేసిన ఇంగ్లిష్ ఆటగాడిగా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఆ జాబితాలో రూట్, కుక్ తర్వాత కెవిన్ పీటర్సన్ (23), వాలే హమోండ్ (22), కోలిన్ కోడ్రే (22) ఉన్నారు. వీరిలో రూట్ ఒక్కడే ప్రస్తుతం ఆడుతున్నాడు.

మరోవైపు ఇంగ్లండ్ తరఫున 50 ఇంటర్నేషనల్ సెంచరీలు చేసిన ఫస్ట్ ఇంగ్లిష్ ప్లేయర్‌గానూ రూట్ ఘనత సాధించాడు. టెస్టుల్లో ఇప్పటి వరకు 34 సెంచరీలు చేసిన 33 ఏళ్ల రూట్.. వన్డేల్లో 16 సెంచరీలు చేశాడు. దీంతో 50 ఇంటర్నేషనల్(International) సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. అత్యధిక అంతర్జాతీయ శతకాలు చేసిన ఇంగ్లండ్ బ్యాటర్ల జాబితాలో రూట్ తర్వాత కుక్ (38), కెవిన్ పీటర్సన్ (32), గ్రహం గూచ్ (28), ఆండ్రూ స్ట్రాస్ (27) ఉన్నారు. ప్రస్తుతం ఆడుతున్న ఇంగ్లండ్ ప్లేయర్లలో రూట్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. ఈ క్రమంలో టెస్టు సెంచరీల విషయంలో భారత దిగ్గజం సునీల్ గవాస్కర్(Sunil Gavaskar), వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా(B Lara)ను జో రూట్ సమం చేశాడు. వారిద్దరూ కూడా 34 టెస్టు సెంచరీలను చేయగా.. రూట్ ఇప్పుడు ఆ మార్క్‌ను అందుకున్నాడు. జో రూట్ నాలుగేళ్లుగా టెస్టు క్రికెట్‍లో సూపర్ ఫామ్‍లో ఉన్నాడు. 44 నెలల్లోనే 17 టెస్టు సెంచరీలు చేశాడు. కెరీర్‌లో పీక్ ఫామ్‍లో ఉన్నాడు. అటు బౌలింగ్‌లోనూ రూట్ విజృంభిస్తున్నాడు.

 టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్లు వీరే

* సచిన్ టెండూల్కర్ (51) సెంచరీలు (200 మ్యాచుల్లో), IND
* జాక్వెస్ కలిస్ (45) సెంచరీలు (166 మ్యాచుల్లో), SA
* రికీ పాంటింగ్ (41) సెంచరీలు (168 మ్యాచుల్లో), AUS
* కుమార సంగాక్కర (38) సెంచరీలు (134 మ్యాచుల్లో), SL
* రాహుల్ ద్రవిడ్ (36) సెంచరీలు (164 మ్యాచుల్లో), IND
* యూనిస్ ఖాన్ (34) సెంచరీలు(118 మ్యాచుల్లో), PAK
* సునీల్ గవాస్కర్ (34) సెంచరీలు(125 మ్యాచుల్లో), IND
* బ్రియాన్ లారా (34) సెంచరీలు(131 మ్యాచుల్లో), WI
* జయవర్ధనే (34) సెంచరీలు (149 మ్యాచుల్లో), SL
* జో రూట్ (34*) సెంచరీలు(145 మ్యాచుల్లో), ENG
* కోహ్లీ (29*) సెంచరీలు (113 మ్యాచుల్లో), IND

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *